Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం, ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట పేర్లు

Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్ని కలవరపెడుతోంది. కవిత పేరుండటమే దీనికి కారణం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 30, 2022, 10:05 PM IST
Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం, ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట పేర్లు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు భయపెడుతోంది. ఊహించినట్టుగానే టీఆర్ఎస్ నేత కవిత పేరు రావడం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టును ఈడీ ఇవాళ బయటపెట్టింది. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నేతల్ని భయపెడుతోంది. కేసులో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో వెలుగు చూసిన నిజాలు అందర్నీ కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ కేసులో ఇప్పుడు కల్వకుంట్ల కవిత పేరు వెలుగు చూడటం భయం గొలుపుతోంది. ఈ కేసులో సౌత్ గ్రూపు వంద కోట్ల ముడుపులు చెల్లించినట్టుగా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. ఈ గ్రూపును శరత్ రెడ్డి, కవిత్, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ ద్వారా వందకోట్ల రూపాయల్ని విజయ్ నాయర్‌కు చేర్చినట్టు ఈడీ స్పష్టం చేసింది.

దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలాన్ని అమిత్ అరోరా ధృవీకరించినట్టు ఈడీ రిపోర్ట్‌లో ఉంది. ఎమ్మెల్సీ కవిత రెండు నెంబర్లు, పది మొబైల్ ఫోన్లు మార్చి..ఈ వ్యవహారం నడిపినట్టుగా ఈడీ నివేదికలో ఉంది. ఈ వ్యవహారంలో 36 మంది 1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. కవిత వాడిన పది ఫోన్ల ఆధారాలు లభించకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావన ఉంది. కవిత ధ్వంసం చేసిన ఫోన్లు, వాటి ఐఎంఈఏ నెంబర్లు, ఫోన్లు మార్చిన తేదీలను రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పొందుపర్చింది. ఫోన్లు మార్చినవారిలో శరత్ రెడ్డి, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, సృజన్ రెడ్డిలు ఉన్నారు. 

Also read: BS 4 Vehicles Scam: బీఎస్ 4 వాహనాల కుంభకోణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్థుల సీజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News