Daniel Shravan comments on rapes | మహిళల వద్ద కండోమ్స్ ఉండాలి.. రేపిస్టులకు సహకరించాలి: డానియెల్ శ్రవణ్ నీచమైన కామెంట్స్!

దిశ ఘటనలో సత్వర న్యాయం జరగాలని ప్రపంచమంతా ఒకవైపు నిలబడి పోరాడుతోంటే.. మరోవైపు మహిళలను అవమానించే రీతిలో వారిపై నీచమైన వ్యాఖ్యలు చేశాడు డానియెల్ శ్రావణ్ అనే ఓ సినీ దర్శకుడు. మహిళలు తమ వెంట కండోమ్స్ ఉంచుకోవాలని.. అత్యాచార ఘటనల్లో రేపిస్టులకు సహకరిస్తే.. వారు హత్యల నుంచి తప్పించుకోవచ్చంటూ డానియెల్ శ్రవణ్ ఇచ్చిన ఓ దరిద్రపుగొట్టు సలహా అతడి నీచ మనస్తత్వాన్ని బయటపెట్టింది.

Last Updated : Dec 4, 2019, 07:16 PM IST
Daniel Shravan comments on rapes | మహిళల వద్ద కండోమ్స్ ఉండాలి.. రేపిస్టులకు సహకరించాలి: డానియెల్ శ్రవణ్ నీచమైన కామెంట్స్!

హైదరాబాద్‌లో దిశపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను దారుణంగా హత్య(Disha gang rape and murder case) చేసిన వైనం యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసిన సంగతి తెలిసిందే. దారుణమైన ఈ ఘటన తర్వాత మహిళలు, ఆడ పిల్లలకు(women safety) ఏ మేరకు రక్షణ ఉందంటూ యావత్ ప్రపంచం గొంతెత్తి ప్రశ్నిస్తోంది. దిశను బలి తీసుకున్న నలుగురు నిందితులకు ఉరి శిక్ష కూడా తక్కువేనని యావత్ భారతం మండిపడుతోంది. మరోవైపు ఇదే విషయమై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తీవ్ర చర్చలు కూడా జరుగుతున్నాయి. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు జరగకుండా ఉండేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పార్టీలకు అతీతంగా సభ్యులందరూ తమ స్వరం వినిపించారు. 

Read also : వాళ్లను చంపేద్దాం సార్.. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి!!

దిశ ఘటనలో సత్వర న్యాయం జరగాలని(Justice for Disha) ప్రపంచమంతా ఒకవైపు నిలబడి పోరాడుతోంటే.. మరోవైపు మహిళలను అవమానించే రీతిలో వారిపై నీచమైన వ్యాఖ్యలు చేశాడు డానియెల్ శ్రావణ్ అనే ఓ సినీ దర్శకుడు. ''వందకు.. బొందకు ఫోన్ చేస్తే ఏమొస్తుందంటూ అత్యంత నీచమైన రాతలు రాసుకొచ్చిన డానియెల్ శ్రవణ్.. మహిళలు తమ వెంట కండోమ్స్ ఉంచుకోవాలని.. అత్యాచార ఘటనల్లో రేపిస్టులకు సహకరిస్తే.. వారు హత్యల నుంచి తప్పించుకోవచ్చంటూ డానియెల్ శ్రవణ్ ఇచ్చిన ఓ దరిద్రపుగొట్టు సలహా అతడి నీచ మనస్తత్వాన్ని బయటపెట్టింది. ''మహిళలు కండోమ్స్ వెంట తీసుకెళ్లాలి.. రేపిస్టులకు సహకరించాలి(women should cooperate with rapists and offer them condoms)'' అని సోషల్ మీడియాలో పలు కామెంట్స్ రాసుకొచ్చిన డానియెల్ శ్రవణ్.. అంతటితో ఊరుకోకుండా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని అత్యాచారాలను చట్టబద్దం చేసేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశాడు. అప్పుడే అత్యాచారాల కారణంగా జరిగే హింసకు ఫుల్‌స్టాప్ పెట్టొచ్చని మరో ఉచిత సలహా ఇచ్చాడు.  

Read also : యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసు: నిందితులున్న చర్లపల్లి జైలు బయట ఉద్రిక్తత.. భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపు

లైంగిక వాంఛ కలిగిన రేపిస్టులకు సహకరించేలా 18 ఏళ్లకు పైబడిన యువతులకు అత్యాచారాలపై అవగాహన కల్పించాలని మరో దరిద్రపుగొట్టు సలహా ఇచ్చాడు. ఇలా డానియెల్ శ్రవణ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇష్టం వచ్చినట్టు పెట్టిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనియాంశమయ్యాయి. డానియెల్ కామెంట్స్‌పై నెటిజెన్స్ చాలా తీవ్రంగా స్పందించారు. బుద్ది, జ్ఞానం ఉండే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, నెటిజెన్స్ ప్రశ్నించినట్టుగానే డానియెల్ ఆ తర్వాత కూడా తన వైఖరిని సమర్థించుకుంటూ ఇంకొన్ని కామెంట్స్ చేశాడు. తాను అలా ఆలోచించడానికి కారణాలు ఉన్నాయంటూ యువతులపై ఇంకొన్ని కామెంట్స్ చేసి మరోసారి తన నీచ మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడు.

Trending News