తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2207 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (Telangana Corona Positive Cases) 75,257కి చేరింది. గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 601కి చేరింది. TikTok: చైనాకు షాక్.. టిక్‌టాక్‌పై ట్రంప్ కీలక నిర్ణయం
అదే సమయంలో 1,136 మంది చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కోవిడ్19 బారి నుంచి 53,239 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 21,417 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. Moderna Vaccine: ఎలుకలపై ఆ కోవిడ్19 వ్యాక్సిన్ సక్సెస్
తాజా కేసులలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో 532 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డిలో 196, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 136, కరీంనగర్‌లో 93, జోగులాంబ గద్వాల 87, కామారెడ్డి 96, నిజామాబాద్ 89, భద్రాద్రి కొత్తగూడెంలో 82, ఖమ్మంలో 85, పెద్దపల్లిలో 71 మంది తాజాగా కరోనా బారిన పడ్డారు. COVID19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. చివరి దశలో ప్రాణాలకే ముప్పు
మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి
Telangana: తాజాగా 2207 కరోనా కేసులు, 600 దాటిన మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి పంజా
తాజాగా 2,207 కోవిడ్19 పాజిటివ్ కేసులు
గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 12 మంది మృతి
హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్య, ఆరోగ్యశాఖ