Telangana Medical Colleges: దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్యరంగం.. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్

CM Kcr Inaugurated New Govt Medical Colleges: తెలంగాణలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. సీఎం కేసీఆర్ వర్చువల్‌గా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 05:07 PM IST
Telangana Medical Colleges: దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్యరంగం.. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్

 

CM Kcr Inaugurated New Govt Medical Colleges: ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తీసుకువస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తోందన్నారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమన్నారు. శుక్రవారం  9 మెడికల్ కాలేజీలను ప్రగతి భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొదట సీఎస్ శాంతి కుమారి ప్రారంభ ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రసంగించారు. సీఎం కేసీఆర్ సందేశం తో సమావేశం ముగిసింది. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో నేటి నుంచి నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి.

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద తెలిపిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి.. వచ్చే ఏడాది మరో 8 వైద్య కళాశాలలు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ ప్రతి ఏటా 10 వేల మంది వైద్యులను దేశానికి అందించనుందని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని పేర్కొన్నారు. ప్రతి లక్ష జనాభాకు 22 మెడికల్‌ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం తెలంగాణకు ఉందన్నారు. రాష్ట్రంలో పది వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

పేదల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. పేద గర్భిణులకు కేసీఆర్‌ కిట్లు, న్యూట్రిషన్‌ కిట్లు అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు ప్రారంభించామని తెలిపారు. మతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని సీఎం తెలిపారు.

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News