తెలంగాణ సీఎం కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసీఆర్ సోదరి లీలమ్మ ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లీలమ్మ.. హైద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
అర్ధాంతరంగా ముగిసిన ఢిల్లీ పర్యటన
సోదరి మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. మరోవైపు కేసీఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనను రద్దు చేసుకున్నారు
లీలమ్మకు ఘన నివాళి
యశోదా ఆస్పత్రిలో కేటీఆర్, హరీశ్ రావు, సీఎం కేసీఆర్ సతీమణి శోభ.. లీలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రి నుంచి లీలమ్మ భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తరలించారు. కాగా లీలమ్మ మరణవార్త తెలుసుకున్న కేసీఆర్ బంధువులు, సన్నిహితులు ఆయన నివాసానికి తరలి వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. నాలుగు నెలల వ్యవధిలోనే మరో సోదరీ లీలమ్మ మరణవార్త వినడం బాధాకరమని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు
తుదిశ్వాస విడిచిన కేసీఆర్ సోదరి