Ayurvedic medicine: కరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు వెంటాడుతూ వేధిస్తున్న వ్యాధి బ్లాంక్ ఫంగస్. ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్‌కు చెక్ పెట్టేందుకు ఆయుర్వేదాన్ని మించింది లేదంటున్నారు ఆయుష్ వైద్యులు. అదేంటో తెలుసుకుందాం.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి దేశం విలవిల్లాడిపోతుంటే..బ్లాక్ ఫంగస్ రూపంలో మరో వ్యాధి నడ్డి విరుస్తోంది. ముఖ్యంగా కోవిడ్ రికవరీ రోగుల్ని టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతోంది.కోవిడ్ సోకి..ఐసీయూలో చికిత్స పొందినవారిలోనూ, ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్స్ వినియోగించినవారిలోనూ ఈ వ్యాధి ఎక్కువగా కన్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడీ కొత్త వ్యాధి ఆందోళనకరంగా మారింది.
ఈ తరుణంలో బ్లాక్ ఫంగస్ (Black Fungus) వ్యాధిని ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా నియంత్రించవచ్చంటున్నారు ఆయుష్ వైద్యులు. ఈఎన్‌టీ అసుపత్రిలో ఇప్పటికే ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నవారికి ఆయుర్వేద మందుల్ని ఇస్తున్నామని తెలంగాణ(Telangana) కు చెందిన ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రరిణామాలుండవని..అల్లోపతి మెడిసిన్ తీసుకుంటున్నాసరే ఇది తీసుకోవచ్చని చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కూడా ఈ మందును తీసుకోవచ్చని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆయుర్వేద మందుల షాపుల్లో ఇది లభ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఈ మందుల్ని ఉచితంగా అందుబాటులో తసుకొచ్చిందని..త్వరలో ప్రజలు అందించనుందని పేర్కొన్నారు.కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్,యాంటీ బయోటిక్స్ వాడకాన్ని తగ్గిస్తే బ్లాక్ ఫంగస్ రాకుండా కాపాడుకోవచ్చన్నారు.
Also read: Black Fungus: బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌పై Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ayurvedic medicine: బ్లాక్ ఫంగస్‌కు ఆయుర్వేద వైద్యంతో చెక్