Telangana Formation Day: 4 లక్షల కోట్లు ఇస్తే.. ఆ నలుగురే దోచుకున్నారు: బండి సంజయ్ ఫైర్

BJP President Bandi Sanjay on Telangana Formation Day: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడలేదని మండిపడ్డారు.

Written by - Ashok Krindinti | Last Updated : Jun 4, 2023, 12:07 PM IST
Telangana Formation Day: 4 లక్షల కోట్లు ఇస్తే.. ఆ నలుగురే దోచుకున్నారు: బండి సంజయ్ ఫైర్

BJP President Bandi Sanjay on Telangana Formation Day:: తెలంగాణ అభివృద్ది కోసం గత 9 ఏళ్లలో కేంద్రం 4 లక్షల కోట్ల రూపాయిలకుపైగా కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 4 కోట్ల మంది ప్రజల కోసం ఆ డబ్బును కేటాయిస్తే నలుగురు దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం ఇఛ్చిన నిధులతోపాటు, చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే.. రాకుండా కేసీఆర్ పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు.

బీజేపీ ధాటికి తట్టుకోలేక టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకుని దేశమ్మీద పడ్డారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మూర్ఖత్వ పాలనలో తెలంగాణ అధోగతి పాలైందన్నారు. ఏ వర్గాన్ని కదిలించినా కష్టాలు.. కన్నీళ్లే కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాధన కోసం బీజేపీ చేసిన పోరాటాలను, అమరుల బలిదానాలను స్మరించుకున్నారు.

తెలంగాణ సాధన కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు చేసిందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే.. "మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణ కల సాకారం చేస్తాం.." అంటూ సుష్మ స్వరాజ్ పార్లమెంట్ వేదికగా చెప్పడమే కాక    తెలంగాణ బిల్లుకు మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. పాతికేళ్ల క్రితమే ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరుతో కాకినాడ తీర్మాణం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. 

Also Read: YSR Yantra Seva Scheme: రైతులకు సీఎం జగన్ మరో గిఫ్ట్.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం

4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షతో ఏర్పడ్డ తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందోంటే కేంద్రం ఇచ్చిన నిధులతోనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రామగుండం ఫ్యాక్టరీ కోసం 6 వేల 338 కోట్లు, జాతీయ రహదారుల కోసం 1.10 లక్షల కోట్లు, ధాన్యం కొనుగోళ్ల కోసం లక్ష కోట్లకుపైగా చెల్లించామన్నారు. మొత్తంగా 4 కోట్ల ప్రజల కోసం 9 ఏళ్లలో 4 లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు.  

"తెలంగాణలో మూర్ఖత్వ పాలన కొనసాగుతోంది. కేంద్రం 4 కోట్ల ప్రజల కోసం 4 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తే.. కేసీఆర్ మాత్రం నలుగురి కోసం పంచుకుంటూ తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేసింది. అభివృద్దిపై చర్చకు రమ్మని అడుగుతుంటే.. కేసీఆర్ పారిపోతున్నడు.. కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారమైతే.. రాష్ట్రంలో ఏ మారుమూలకు పోయి ఏ రైతన్నను పలకరించినా ఎందుకు కన్నీళ్లే కారుస్తున్నారో చెప్పాలి. అన్నం పెట్టిన చేతులు వడ్లకుప్పలపై జీవచ్చాలుగా  మారినయ్..? ఏ నిరుద్యోగ తమ్ముడిని పలకరించినా  పటపట పళ్లు కొరుకుతున్నడు..? ఏ కార్మికుడుని, ఉద్యోగిని కదిలించినా కసితో  రగిలిపోతున్నడు..? ఏ అక్క, చెల్లెమ్మను చూసినా రాణిరుద్రమ్మలా, కాళికాదేవిలా  హుంకరిస్తోంది..? తెలంగాణ సాధించుకున్నది ఇందుకోసమేనా అని బాధాతప్త హృదయాలే కన్పిస్తున్నయ్.." అని బండి సంజయ్ అన్నారు.

Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్‌ జట్టులో ఉండాల్సిందే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News