BJP MLA Raghunandan Rao: కృష్ణా నది తీరం కబ్జా చేసి.. 165 ఎకరాల్లో మంత్రి ఫామ్ హౌజ్..

BJP MLA Raghunandan Rao: మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణా నది భూములు ఆక్రమించి మంత్రి ఫామ్ హౌజ్ నిర్మించుకున్నారన్న రఘునందన్ రావు.. ఆయా భూములకు సంబంధించిన రికార్డులు మానోపాడు తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని అన్నారు.  

Written by - Pavan | Last Updated : Apr 19, 2023, 04:30 AM IST
BJP MLA Raghunandan Rao: కృష్ణా నది తీరం కబ్జా చేసి.. 165 ఎకరాల్లో మంత్రి ఫామ్ హౌజ్..

BJP MLA Raghunandan Rao: మంత్రి నిరంజన్ రెడ్డి కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి 165 ఎకరాల్లో ఫార్మ్ హౌజ్ నిర్మించుకున్నారని బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనే కాంపౌండ్ వాల్ నిర్మించారని.. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో సిసి రోడ్లు సైతం నిర్మించుకున్నారని రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ పార్టీ ఆఫీసులో జరిగివ విలేకరుల సమావేశంలో రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. గిరిజనుల పేరు మీద 7 కోట్ల రూపాయల రుణం తీసుకుని సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నారని అన్నారు. అంతేకాకుండా మంత్రి నిరంజన్ రెడ్డి ఫార్మ్ హౌజ్ నిర్మించుకున్న మానోపాడు మండలంలో తహశీల్దార్ కార్యాలయం తగలబడటం వెనుక మంత్రి నిరంజన్ రెడ్డి ప్రమేయం ఉందన్నారు. 

మానోపాడు మండలం తహశీల్ధార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి కబ్జా చేసిన స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మాయం చేసేందుకు జరిగిన అగ్ని ప్రమాదంగా రఘునందన్ రావు అభివర్ణించారు. తహశీల్ధార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది అని తహశీల్ధార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. మానోపాడు పోలీసులు కనీసం చార్జిషీట్ కూడా వేయలేదు అని తెలిపారు.
 
1973-1974 ఆర్డిఎస్ కింద సేకరించిన భూములను మంత్రి నిరంజన్ రెడ్డి స్వాధీనం చేసుకున్నట్టు రఘునందన్ రావు పేర్కొన్నారు. ఆయా భూములకు సంబంధించిన రికార్డులు మానోపాడు తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. అది నిజం కాకపోతే అక్కడ 80 ఎకరాలు కొన్న మంత్రి నిరంజన్ రెడ్డి 165 ఎకరాల స్థలంలో ఫార్మ్ హౌజ్ ఎలా నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది 31 మార్చిన 147 జీవోతో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని ఫార్మ్ హౌజ్‌కి గిరిజన శాఖ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నారు. 

ఇది కూడా చదవండి : Minister Singireddy Niranjan Reddy: తనకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పిన మంత్రి నిరంజన్ రెడ్డి

పానగల్ మండలం కొత్తపేట గ్రామ పంచాయితీ పరిధిలో మంత్రి నిరంజన్ రెడ్డి 100 ఎకరాల్లో మరో ఫార్మ్ హజ్ నిర్మించారు. పెద్ద మందాడి మండలంలో మరో 50 ఎకరాల్లో ఇంకో ఫార్మ్ హౌజ్ నిర్మించారు. ఇలా మొత్తం మూడు చోట్ల మంత్రి నిరంజన్ రెడ్డి ఫామ్ హౌజ్‌లు నిర్మించుకున్నట్టు రఘునందర్ రావు ఆరోపించారు. గతంలో మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్‌పై అవినీతి ఆరోపణలు రాగానే ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించారు. అంతకు ముందు దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యని కేబినెట్ నుంచి భర్తరఫ్ చేశారు. మరి ఈ స్థాయిలో అవినీతికి పాల్పడిన  అగ్రవర్ణాలకు చెందిన మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని రఘునందన్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇది కూడా చదవండి : Jagtial Govt Hospital: డెలివరి కోసం హాస్పిటల్‌కి వెళ్తే.. కడుపులో బట్ట పెట్టి కుట్లేశారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x