MLC Kavitha Delhi Liquor Scam: ఇది మహిళలు చేసే వ్యాపారామా..? నీకు ఇదే దొరికిందా..? ఎమ్మెల్సీ కవితపై ఈటల ఫైర్

MLA Etela Rajender On Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో ఆడవాళ్లు ఉంటారా అని గ్రామాల్లో మహిళలు అడుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వ్యాపారం చేసుకోవడానికి ఇదే దొరికిందా..? అని ఆయన ఫైర్ అయ్యారు. చట్టానికి సహకరించి.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 07:33 PM IST
MLC Kavitha Delhi Liquor Scam: ఇది మహిళలు చేసే వ్యాపారామా..? నీకు ఇదే దొరికిందా..? ఎమ్మెల్సీ కవితపై ఈటల ఫైర్

MLA Etela Rajender On Delhi Liquor Scam: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కవిత విచారణ రాజకీయ కుట్ర అయితే.. అది ఈ రాష్ట్రంలోనీ వారిమీదనే విచారణ జరగాలని.. కానీ  కేరళ, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్  రాష్ట్రాల వాళ్లను విచారణ చేస్తున్నారని అన్నారు. దేశ రాజధానిలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు ఇన్వాల్వ్ అయ్యాయన్నారు. రాజకీయ కుట్ర అయితే కోర్టు తేలుస్తుందని.. మీరెందుకు భయపడాలని ప్రశ్నించారు. పరకాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఈటల సమాధానాలు ఇచ్చారు. 

'తప్పు చేస్తే నా కొడుకు అయినా.. బిడ్డనైనా వదిలిపెట్టనని స్వయంగా అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పారు. మరి తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు. రాజకీయపరమైన వేధింపులు అని రాజ్యాంగాన్ని, చట్టాన్ని అపహస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంపాదన సరిపోదు అన్నట్టుగా కుటుంబ పాలనలో ఢిల్లీ దాకా ఎగపాకారు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సరిపోవడం లేదు దేశవ్యాప్తంగా విస్తరిద్దామని అనుకుంటున్నారా..? 

రాజకీయపరంగా వేధింపులకు పాల్పడితే ఆ కేసు కోర్టులలో నిలవదు. తప్పు చేశారా లేదా అనేది ఏజెన్సీలు తెలుస్తాయి. అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టం మీద సంపూర్ణ నమ్మకం ఉన్నవాళ్లం. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. కేసీఆర్ అబద్ధాలను కూడా ప్రజలను నమ్మించే విధంగా చెప్పగలరు. మీరు దాచుకొండి దోచుకోండి.. మీకు ఆపద వచ్చినప్పుడు మీకు అండగా ఉంటామని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏమన్నా రాసి ఇచ్చారా..? మీకు కష్టం రాగానే కాపాడండి అని అడగడానికి. 

ఇది మహిళలు చేసే వ్యాపారామా..? లిక్కర్ స్కామ్‌లో ఆడవాళ్లు ఉంటారా అని గ్రామాల్లో మహిళలు అడుగుతున్నారు. బిజినెస్ చేసుకోవడానికి ఇదే దొరికిందా..? మహిళగా ఇది ఒక కళంకం. చట్టానికి సహకరించండి.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. దారిలో పోయే దానయ్య కంప్లైంట్ చేస్తే నన్ను తీసివేశావ్.. కనీసం విచారణ చేశావా..? చేయకుండానే తీసివేశావ్.. హుజురాబాద్ వస్తివి.. దెబ్బలు తింటివి.. ఈటల రాజేందర్ తప్పు చేశారా..? కేసీఆర్ చేశారా..? అని అడిగితే ప్రజలు తేల్చి చెప్పారు. మీ మీద ఆరోపణలు వస్తే మాత్రం విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు వెనక్కు పోతున్నారు..' అని ఈటల రాజేందర్ అన్నారు. 

Also Read: Aadhar PAN Link: సమయం లేదు మిత్రమా.. 10 రోజుల్లో ఈ పనిచేయకపోతే పాన్ కార్డు చెత్త బుట్టలో వేయండి  

Also Read: MLC Kavitha: వరుసగా ఫోన్లను మార్చిన ఎమ్మెల్సీ కవిత.. రహాస్య వ్యవహారాల కోసమేనా..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News