ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగిన డీకే అరుణ

తెలంగాణాలో మద్యాన్ని నిషేదించడంతో పాటు మద్యం నియంత్రణకు కఠినమైన విధానాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ గురువారం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద సంకల్ప దీక్ష ప్రారంభించారు. 12,13వ తేదీల్లో రెండు రోజుల పాటు డికె అరుణ దీక్ష కొనసాగనుంది.

Last Updated : Dec 12, 2019, 09:20 PM IST
ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగిన డీకే అరుణ

హైదరాబాద్: తెలంగాణాలో మద్యాన్ని నిషేదించడంతో పాటు మద్యం నియంత్రణకు కఠినమైన విధానాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ గురువారం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద సంకల్ప దీక్ష ప్రారంభించారు. 12,13వ తేదీల్లో రెండు రోజుల పాటు డికే అరుణ దీక్ష కొనసాగనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నియంత్రించి దశల వారీగా మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఈ దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రారంభించారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. ''మద్యం వల్ల యువత చెడిపోతుందని.. మద్యానికి బానిసై ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని , మద్యం బారినుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి'' అని హితవు పలికారు. మద్యం బాధితులైన వారి కుటుంబసభ్యులు సహా, ఇటీవల ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యాచారానికి గురైన బాధితులు ఈ దీక్షకు హాజరయ్యారని ఆమె తెలిపారు.

ఈ దీక్షలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం సరఫరా విచ్చలవిడిగా పెరిగిపోయిందని, తెలంగాణ రాష్ట్ర సర్కారు విధానాలు, కేసీఆర్ వల్లే గొప్ప చారిత్రాత్మక నగరంగా ఉన్న హైదరాబాద్ కాస్తా బ్రాందీ హైదరాబాద్‌గా మారిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని.. మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వం రూ. సుమారుగా 1000 కోట్ల ఆదాయం స్వీకరించిందని అన్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాల ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. 

పెరుగుతున్న మద్యం విక్రయాలు.. పెరుగుతున్న నేరాలు..
ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కే లక్ష్మణ్.. ఓవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నప్పటికీ.. మద్యం అమ్మకాలు మాత్రం పెంచుకుంటూపోతున్నారే కానీ తగ్గించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ యువతను మద్యంలో ముంచి నాశనం చేస్తున్నారన్నారు. మద్యం అమ్మకాలు అర్ధరాత్రి వరకు కొసాగుతున్నాయని... మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం వల్లే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మద్యం నిషేధించాలని రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ  ఆందోళనలు ఉధృతం చేస్తుందని, గ్రామాల్లో మద్యం షాపులను లేకుండా చేయాలని మహిళా మోర్చా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం'' అని అన్నారు.

Trending News