CHARMINAR WAR: చార్మీనార్ పై కాంగ్రెస్, బీజేపీ ఫైట్.. అసలు వివాదం ఏంటీ? హైదరాబాదీలు ఏమంటున్నారు?

CHARMINAR WAR:  హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది చార్మీనార్. భాగ్యనగరానికి సింబాలిక్ గా ఉంది ఈ చరిత్రాత్మక కట్టడం. చార్మీనార్ దగ్గరే ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్. పాతబస్తీలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి ఈ రెండు కట్టడాలు. అయితే హైదరాబాదీలు గర్వంగా చెప్పుకునే చార్మీనార్ చుట్టూ ఇప్పుడు రచ్చ సాగుతోంది. రాజకీయ రగడ ముదురుతోంది

Written by - Srisailam | Last Updated : Jun 3, 2022, 07:08 AM IST
  • చార్మీనార్ కేంద్రంగా కొత్త వివాదం
  • కాంగ్రెస్ నేతల సంతకాల సేకరణ
  • తీవ్రంగా తప్పుపడుతున్న బీజేపీ
CHARMINAR WAR: చార్మీనార్ పై కాంగ్రెస్, బీజేపీ ఫైట్.. అసలు వివాదం ఏంటీ? హైదరాబాదీలు ఏమంటున్నారు?

CHARMINAR WAR:  హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది చార్మీనార్. భాగ్యనగరానికి సింబాలిక్ గా ఉంది ఈ చరిత్రాత్మక కట్టడం. చార్మీనార్ దగ్గరే ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్. పాతబస్తీలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి ఈ రెండు కట్టడాలు. అయితే హైదరాబాదీలు గర్వంగా చెప్పుకునే చార్మీనార్ చుట్టూ ఇప్పుడు రచ్చ సాగుతోంది. రాజకీయ రగడ ముదురుతోంది. చార్మినార్‌ లో నమాజ్ కు అనుమతి ఇవ్వాలంటూ సంతకాల సేకరణ మొదలైంది. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. టీపీసీసీ కార్యదర్శిగా ఉన్న రషీద్ ఖాన్ చార్మీనార్ లో ప్రార్ధనలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ మొదలు పెట్టారు. కేంద్ర సర్కార్ పరిధిలోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉంటుంది చార్మినార్‌. అయితే గతంలో ఈ కట్టడంలో ముస్లింలు నమాజ్ చేసేవారని, రెండు దశాబ్దాల క్రితం నిషేదించారని రషీద్ ఖాన్ చెబుతున్నారు. గత సంప్రదాయాన్ని అనుమతించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ చేపట్టిన సంతకాల సేకరణపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందువులంతా  భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటే.. మీకు నమాజ్ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.  అంతకుముందు నమాజ్ ఎందుకు చేయలేదని నిలదీశారు. భాగ్యలక్ష్మీ ఆలయంపై చేయి వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ కు అంత ధమ్ముందా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఈ కుట్రకు తెరలేపాయని సంజయ్ ఆరోపించారు. చార్మినార్ దగ్గర ఆలయం లేదని చెప్పేవాడు మూర్ఖుడు అని మండిపడ్డారు.

చార్మీనార్ పై విషయంలో చేపట్టిన సంతకాల సేకరణను ముస్లిం సమాజం సైతం హర్షించదని గోషామాహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పబ్లిసిటీ కోసమే సంతకాల సేకరణ చేపట్టారన్న రాజాసింగ్.. ఇలాంటి చిల్లర పనులు చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే తాము కూడా సంతకాల సేకరణ చేపడుతామని చెప్పారు. రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ లేదన్న రాజాసింగ్.. సంతకాల సేకరణ చేపట్టిన రషీద్ ఖాన్ పై  సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో అల్లర్లు స్పష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని బీజేపీ సీనియర్ నేత రామచంద్రరరావు అన్నారు. మతపరమైన అంశాలను తీసుకొచ్చి.. తమ బలం పెంచుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. చార్మీనార్, భాగ్యలక్ష్మి టెంపుల్స్ అందరివి అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. భాగ్యలక్ష్మి ఆలయం తమ సొంతమన్నట్లుగా బండి సంజయ్ మాట్లాడం మానుకోవాలని హితవు పలికారు. ఈ అంశంపై అధికార టీఆర్ఎస్ మాత్రం ఇంకా స్పందించడం లేదు.

మరోవైపు చార్మీనార్ కేంద్రంగా తాజాగా సాగుతున్న వివాదంపై హైదరాబాద్ వాసుల్లో మాత్రం ఆందోళన కల్గిస్తోంది. రాజకీయ లబ్ది కోసం సున్నితమైన అంశాలపై వివాదం చేయడం సరికాదని అంటున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగర గొప్పతనాన్ని అనవసర వివాదాలతో బద్నాం చేయవద్దని స్థానిక ప్రజలు కోరుతున్నారు.ఇలాంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్ హైదరాబాదీల నుంచి వస్తోంది.

READ ALSO: Punjab Govt: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..వీవీఐపీల భద్రతపై యూటర్న్..!

READ ALSO: Sourav Ganguly Tweet: బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా.. రాజకీయాల్లోకి దాదా! చేరేది ఆ పార్టీలోనే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News