Bird Flu Tension In Nizamabad After 1500 Chickens Died: దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న బర్డ్ ఫ్లూ దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపుతోంది. పక్షులు, జంతువుల నంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకదని, ఏం ఆందోళన చెందనక్కర్లేదని తెలుగు రాష్ట్రాల్లో వైద్యశాఖల అధికారులు చెబుతున్నారు. కానీ తెలంగాణలో గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. వేలాదిగా కోళ్లు మృతిచెందుతున్నాయి.
తాజాగా నిజామాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండా శివారులో ఉన్న దుర్గాభవాని పౌల్ట్రీ ఫామ్‌లో 24 గంటలు గడిచేలోగా 1,500 వరకు కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. రెండు షెడ్లలో సుమారు 8,000 కోళ్లు పెంచుతున్నారు. అయితే మంగళవారం రాత్రి దాదాపు 1000 కోళ్లు బర్డ్ ఫ్లూ(Bird Flu) చనిపోగా, బుధవారం మరో 500 కోళ్లు మృత్యువాత పడ్డాయని పౌల్ట్రీ ఫామ్ యజమాని చెబుతున్నారు.
Also Read: Corona Vaccine: అన్ని రాష్ట్రాలు రెడీ.. తొలి దశలో 1.65 కోట్ల టీకాలు
చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో బుధవారం మధ్యాహ్నం సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. మధ్యాహ్నం తర్వాత రెండు షెడ్లలో మరో 500 పైగా కోళ్లు చనిపోయాయి. డిచ్‌పల్లి మండల పశువైద్యాధికారి డాక్టర్ గోపికృష్ణ నుంచి సమాచారం అందుకున్న నిజామాబాద్(Nizamabad) జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ భరత్, ఏడీ(ల్యాబ్) కిరణ్ దేశ్‌పాండే బుధవారం సాయంత్రం పౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించారు.
Also Read: Pongal 2021 Date, Time: మకర సంక్రాంతి తేదీలు, ముహూర్తం.. పండుగ ప్రాముఖ్యత
24 గంటల్లోగా 1500 కోళ్లు చనిపోవడంపై పౌల్ట్రీ ఫామ్ యజమానితో మాట్లాడారు కోళ్లకు చివరగా వ్యాక్సినేషన్ ఎప్పుడు చేశారు, వాటికి దాణా ఎక్కడి నుంచి తెస్తున్నారు లాంటి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన కోళ్ల రక్త నమూనాలతో పాటు బతికున్న వాటి నమూనాలను సైతం పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు.
Also Read: Anasuya: యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ అదుర్స్.. ఫొటోస్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook