Bible Distribution Issues: ప్రభుత్వ పాఠశాళాలు ప్రచారం కేంద్రాలుగా మారుతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు మత బోధకులుగా మారుతున్నారు. ఇటీవలే ఓ టీచర్ ఏకంగా విద్యార్థులకు బైబిల్ పంపిణి చేశాడు. ఈ విషయం విద్యార్థుల కుటుంభ సభ్యులకు తెలియడంతో ఉపాధ్యాయుడిని, విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నిలదీశారు. విద్యా బోధనలు నేర్పించే పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మత ప్రచారం చేయడం, క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు బైబిల్‌ను పంపిణీ చేయడం సంచలనంగా మారింది. హిందూ సంఘాలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్థానికులు పాఠశాల వద్ద ఉపాధ్యాయుడితో ఆందోళనకు దిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో సుమారు 100 మంది విద్యార్థులకు బైబిల్లను పంపిణీ చేశాడు. ఈ విషయాన్ని పాఠశాల విద్యార్థులు స్థానిక బిజెపి పార్టీ నాయకులకు ఫిర్యాదు చేయగా.. స్థానిక పార్టీకి చెందిన నాయకులు నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని, ఉపాధ్యాయుడు పంచిన బైబిల్స్‌ను విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
పాఠశాల ఉపాధ్యాయ గదిలో ఉన్న మరికొన్ని బైబిల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి శ్రీహరికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పంపిణీకి సంబంధించి వీడియోలను బిజెపి నాయకులు ఎంఈఓకు అందజేశారు. ఉపాధ్యాయుడు లింగాల రాజపై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని బిజెపి నాయకులు కోరారు. జిల్లా విద్యాధికారికి కూడా ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు. క్రిస్మస్ గిఫ్ట్‌ల పేరుతో ప్రభుత్వ పాఠశాలలో వందమంది విద్యార్థులకు బైబిల్స్‌ను పంచినట్లు సమాచారం.
అయితే ఈ విచారణ చేపట్టిన అధికారులు విద్యాలయంలో మత ప్రచారం చేసేందుకు యత్నించిన ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ లింగాల రాజును సస్పెండ్ చేస్తూ డీఈఓ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ మతానికి సంబంధించిన కరపత్రం, ఇతర సామాగ్రిని పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.