Bandi Sanjay's Son Booked: బండి సంజయ్ తనయుడు సాయి భగిరథ్‌పై కేసు నమోదు.. అసలేం జరిగింది ?

Bandi Sanjay's Son Booked: బండి సాయి భగిరథ్ తన జూనియర్ విద్యార్థిపై దుర్షాషలాడుతూ దాడికి పాల్పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగిరథ్ పై కేసు నమోదైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 08:47 PM IST
Bandi Sanjay's Son Booked: బండి సంజయ్ తనయుడు సాయి భగిరథ్‌పై కేసు నమోదు.. అసలేం జరిగింది ?

Bandi Sanjay's Son Booked: బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగిరథ్ పై కేసు నమోదైంది. తాను బిటెక్ చదువుకుంటున్న మహింద్రా యూనివర్శిటీలో జూనియర్ విద్యార్థిపై చేయి చేసుకున్న వీడియ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న పోలీసులు.. బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగిన మహింద్రా యూనివర్శిటీ దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉండటంతో దుండిగల్ పిఎస్ లోనే బండి సాయి భగీరథ్ పై ఐపిసి సెక్షన్స్ 341, 323, 504, 506 r/w 34 కింద కేసు నమోదు చేశారు. 

అసలేం జరిగింది ? సాయి భగీరథ్ ఎందుకు చేయి చేసుకున్నాడు ?
బండి సాయి భగిరథ్ తన జూనియర్ విద్యార్థిపై దుర్షాషలాడుతూ దాడికి పాల్పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన జరిగి రెండేళ్లు అవుతోందని తెలుస్తోంది. తన ఫ్రెండ్ చెల్లిని ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడనే కారణంతోనే సాయి భగీరథ్ ఆ కుర్రాడిపై దాడికి పాల్పడినట్టు సమాచారం అందుతోంది. మరోవైపు సాయి భగిరథ్ చేతిలో దాడికి గురైన బాధిత విద్యార్థి సైతం తన తప్పు తెలుసుకున్నాడని.. అందువల్లే ఈ ఘటనపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదనేది ఆ సమాచారం సారాంశం.

ఇప్పుడెవరు లీక్ చేశారు.. ఎందుకు చేశారు.. ఆ అవసరం ఎవరికి ఉంది ?
ఈ ఘటనలో దాడికి పాల్పడిన యువకుడు బండి సాయి భగీరథ్ బండి సంజయ్ తనయుడు కావడంతో రాజకీయంగా బండి సంజయ్ ని దెబ్బకొట్టేందుకు ఇప్పుడు ఈ వీడియోను లీక్ చేశారని.. దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తమే ఉండి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బాధిత యువకుడు ఫిర్యాదు చేయనప్పటికీ.. అప్పుడు వెలుగుచూడని ఈ వీడియో ఇప్పుడు వెలుగులోకొచ్చిందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్.. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు ఇవాళ రాత్రి 9 గంటలకు ఢిల్లీలోని తలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. బండి సంజయ్ కుమార్ ఏమని స్పందించనున్నారు, మున్ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగనుందో వేచిచూడాల్సిందే మరి.

ఇది కూడా చదవండి : Man Dragged Behind Scooter: ఎంత అరాచకం.. మిట్ట మధ్యాహ్నం వృద్ధుడిని రోడ్డుపై స్కూటీతో లాక్కెళ్లాడు

ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్

ఇది కూడా చదవండి : Salary Hikes in 2023: జీతాల పెంపుపై ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News