Junior Panchayat Secretaries: అప్పుడు జేపీఎస్‌లు అందరినీ విధుల్లోకి తీసుకుంటాం : బండి సంజయ్

Telangana Junior Panchayat Secretaries Strike: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని... ఆ మాట నిలబెట్టుకోవాలని కోరుతూ గత 11 రోజులుగా నడి ఎండలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తే ప్రభుత్వం పట్టించుకోకపోగా వారిపై బెదిరింపు చర్యలకు దిగుతారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

Last Updated : May 9, 2023, 02:52 AM IST
Junior Panchayat Secretaries: అప్పుడు జేపీఎస్‌లు అందరినీ విధుల్లోకి తీసుకుంటాం : బండి సంజయ్

Telangana Junior Panchayat Secretaries Strike: న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుండి తొలగించేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. జూనియర్ కార్యదర్శులు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయమైనదే. వారు చేస్తున్న సమ్మెకు బీజేపీ ఇప్పటికే సంఘీభావం ప్రకటించింది అని బండి సంజయ్ ప్రకటించారు.  

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేసిన తప్పేంటి ? పరీక్షలు రాసి పాసై ఉద్యోగాల్లో చేరి నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారు. ఏ ఉద్యోగానికైనా ప్రొబేషనరీ పీరియడ్ ఏడాదో, రెండేళ్లో ఉంటుంది. కానీ వీళ్లకు మాత్రం ప్రొబేషనరీ పీరియడ్ మూడేళ్లు పెట్టినా పనిచేశారు. రెగ్యులరైజ్ చేయకుండా మళ్లీ మరో ఏడాది గడువు పెంచడం ఎంత వరకు సమంజసం ? మనసులో ఎంత బాధ ఉన్నా భరిస్తూ రాత్రింబవళ్లు పని చేస్తూ నాలుగేళ్లపాటు ప్రొబేషనరీ పీరియడ్‌ను పూర్తి చేశారు. అయినప్పటికీ నేటికీ వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయం. వీళ్లంటే కేసీఆర్‌కు ఎందుకంత కక్ష? కేసీఆర్ కుటుంబానికి లంచాలు ఇవ్వలేదేమో.. పైసలిస్తే ఈపాటికే రెగ్యులరైజ్ చేసేవాళ్లేమోననే అనుమానం కలుగుతోంది బండి సంజయ్ మండిపడ్డారు. 

వాస్తవానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. మాట నిలబెట్టుకోవాలని కోరుతూ గత 11 రోజులుగా నడి ఎండలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. వాళ్ల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్దమైనవే. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని సమ్మె చేస్తున్న జూనియర్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులిస్తారా ? మరి మాట తప్పిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

రుణమాఫీ, ఫ్రీ యూరియా, నిరుద్యోగ భృతి, ఇంటింటికొక ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు పథకాలు అమలు చేస్తానని హామీలిచ్చి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు కావొస్తున్నప్పటికీ.. ఆ హామీలను అమలు చేయకుండా మాట తప్పిన కేసీఆర్ ను ఏం చేయాలి అని నిలదీశారు. కేసీఆర్ దగ్గర అధికారం ఉంది కదా ? అని రెక్కాడితే డొక్కాడని కార్యదర్శులపై ప్రతాపం చూపిస్తారా ? కేసీఆర్ అధికార అహంకారం వల్ల ఇప్పటికే వీఆర్వో వ్యవస్థ సర్వనాశనమైంది. వీఆర్ఏలు నెలలు తరబడి రోడ్డున పడ్డారు. 23 వేల మంది ఆర్టిజన్లు సమ్మె చేసి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 22 వేల మంది స్కావెంజర్ల జీవితాలను రోడ్డున పడేశారు. ఇయాళ పంచాయతీ కార్యదర్శుల బతుకులను కూడా బర్‌బాద్ చేయాలనుకోవడం కేసీఆర్ అమానవీయ చర్యలకు నిదర్శనంగా బండి సంజయ్ అభివర్ణించారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఏం చేసినా చెల్లుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు. వాళ్లకు బీజేపీ అండగా ఉంటుంది. వాళ్లను ఉద్యోగాల నుండి తొలగిస్తే కేసీఆర్ ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా కేసీఆర్ కు వారం రోజులు గడువిస్తున్నాం... పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. లేనిపక్షంలో పంచాయతీ కార్యదర్శులతో కలిసి సీఎం సహా మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ప్రగతి భవన్‌ను కూడా ముట్టడిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అవసరమైతే న్యాయపరమైన చర్యలకూ వెనుకాడబోం అని బండి సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy Election Promises: నిరుద్యోగ భృతి నెలకు రూ. 4 వేలు, 10 లక్షలు వడ్డీ లేని రుణాలు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ, ఇంకా..

జూనియర్ పంచాయతీ కార్యదర్శులెవరూ భయపడొద్దు... భయపెట్టి కార్యదర్శుల్లో ఉన్న ఐక్యతను చీల్చాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దు. అందరూ ఐక్యంగా ఉండండి. ఇన్నాళ్లు సమ్మె చేశారు. భార్యాబిడ్డలకు దూరమై రాత్రింబవళ్లు పనిచేశారు. ఉద్యోగాల నుండి తొలగిస్తే ఇంట్లోనే ఉండండి. కార్యదర్శుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగేది మరో 5 నెలలే. ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వస్తుంది. తొలగించిన ఉద్యోగులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటాం అని బండి సంజయ్ కుమార్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి : Priyanka Gandhi Speech: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. హామీలు నెరవేర్చకపోతే మీరే కూల్చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News