Attack on MLA Kishan Reddy: రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కారుపై కోడిగుడ్లతో దాడి

Attack on MLA Kishan Reddy: ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి కాన్వాయ్​పై కొందరు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగింది. ఎమ్మెల్యే కారుపై ఎన్​ఎస్​యూఐ నాయకులు కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 05:06 PM IST
    • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాన్వాయ్ పై దాడి
    • కోడిగుడ్లతో దాడి చేసిన ఎన్​ఎస్​యూఐ నాయకులు
    • ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడి చేశారనే ఆరోపణలతో దాడి
Attack on MLA Kishan Reddy: రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కారుపై కోడిగుడ్లతో దాడి

Attack on MLA Kishan Reddy: తెలంగాణలో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరాస్తా వద్ద ఎమ్మెల్యే కారుపై ఎన్​ఎస్​యూఐ నాయకులు కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడికి నిరసనగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారును ఆపిన ఆందోళనకారులు.. రోడ్డుకి అడ్డుగా వచ్చిన కారును ఆపి కోడిగుడ్లతో దాడి చేశారు. 

ఈ ఘటనతో ఇబ్రహీంపట్నంలో తీవ్ర కలకలం రేపుతోంది. కోడిగుడ్లతో దాడి చేసిన వారిపై ఎమ్మెల్యే అనుచరులు బాహాబాహీకి దిగడం వల్ల అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతలో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఇరువర్గాలు చెదరగొట్టారు. 

ఏం జరిగిందంటే?

రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇటీవలే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎన్​ఎస్​యూఐ సంఘం ముట్టడిగా ప్రయత్నించింది. అయితే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన ఎన్​ఎస్​యూఐ నేతలపై సదరు ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడ్డారు.

ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఎన్​ఎస్​యూఐ నేతలు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన ఎన్​ఎస్​యూఐ నేతలు ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి చేశారు.  

Also Read: Fake Facebook Account: ఎమ్మెల్యే పేరు మీదే ఫేక్‌ అకౌంట్.. అమ్మాయిల ఫోటోలు అప్‌లోడ్‌!

Also Read: Medaram Jatara Bus Timings: మేడారం జాతరకు స్పెషల్ బస్సులు.. ఏఏ సమయాల్లో అందుబాటులో ఉంటాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News