Amit Shah Meets Jr Ntr: బిగ్ బ్రేకింగ్: అమిత్ షాను కలవనున్న జూనియర్ ఎన్టీఆర్..పొలిటికల్ రీ ఎంట్రీ!

Amit Shah Meets Jr NTR: తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామం జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కాబోతున్నారనే సమాచారం వస్తోంది.

Written by - Srisailam | Last Updated : Aug 21, 2022, 02:17 PM IST
  • జూనియర్ ఎన్టీఆర్ కు అమిత్ షా ఆహ్వానం
  • మునుగోడు సభ తర్వాత సమావేశం
  • జూనియర్ పొలిటికల్ రీ ఎంట్రీ?
Amit Shah Meets Jr Ntr: బిగ్ బ్రేకింగ్: అమిత్ షాను కలవనున్న జూనియర్ ఎన్టీఆర్..పొలిటికల్ రీ ఎంట్రీ!

Amit Shah Meets Jr NTR: తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామం జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కాబోతున్నారనే సమాచారం వస్తోంది. మునుగోడు బీజేపీ సభకు వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మునుగోడు సభ తర్వాత రాత్రి 8 గంటలకు నోవాటెల్ హోటల్ లో అమిత్ షా తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికే అమిత్ షా నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం వచ్చింది. అమిత్ షాను కలవడానికి జూనియర్ నోవాటెల్ హోటల్ కు వెళ్లబోతున్నారు. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచనంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తిరిగి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా అన్న చర్చ సాగుతోంది.

2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు తారక్. ప్రత్యేక చైతన్య  రథంపై ఆయన పర్యటించారు. ఆయన ప్రచారానికి, ప్రసంగాలకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ సమయంలోనే జూనియర్ కు నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైఎస్సార్ రెండో సారి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు జూనియర్ ఎవ్టీఆర్. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ మహానాడులకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్.. గత కొన్నేళ్లుగా టీడీపీ మహానాడుకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ తెలుగు తమ్ముళ్ల నుంచి డిమాండ్ వస్తోంది. ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే తారకకు మద్దతుగా ప్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి.

మరోవైపు బీజేపీ వర్గాలు మాత్రం అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన త్రిపుల్ ఆర్ సినిమా బాలీవుడ్ లో దుమ్మ రేపింది. ఆ సినిమాలో జూనియర్ నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆస్కార్ ఆవార్డు రేసులోకి జూనియర్ వచ్చారని ప్రచారం సాగుతోంది. ఇటీవలే అమిత్ షా త్రిపుల్ ఆర్ సినిమా చూశారని.. జూనియర్ నటనకు ఫిదా అయిపోయారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అద్భుతంగా నటించిన జూనియర్ ను ప్రశంసించేదుకే అమిత్ షా ఆహ్వానించారని క్లారిటీ ఇస్తున్నారు.

రాజకీయ వర్గాల్లో మాత్రం అమిత్ షా, తారక్ సమావేశం హాట్ హాట్ గా మారింది. తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. హైదరాబాద్ లో సెటిలర్లు భారీగా ఉన్నారు. జూనియర్ తో ఆ ఓట్లకు గాలం వేసేలా బీజేపీ హైకమాండ్ స్కెచ్ వేసిందని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఉంటుందని కమలనాధుల ప్లాన్ అంటున్నారు.

Also Read: Heavy Rains: హిమాచల్‌ప్రదేశ్‌లో వరద విలయం..22 మంది మృతి, పలువురు గల్లంతు..!

Also Read:Vijay Devarakonda Boycott Liger: ఇండియా ఫ్లాగ్ ఎగరవేస్తే సినిమాని బాయికాట్ చేస్తారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News