ACB raiding on Malkajigiri ACP Narsimha Reddy residence: హైదరాబాద్: యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహా రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో ( Disproportionate assets ) ఏసీపీ నర్సింహా రెడ్డి నివాసంతో పాటు ఆయన సమీప బంధువుల నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 12 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గతంలో ఉప్పల్ సీఐగా పనిచేసిన నర్సింహా రెడ్డి.. అక్కడ విధులు నిర్వహించే క్రమంలో అనేక భూతగాదాల్లో ( Land disputes, land settlements ) తలదూర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. Also read : New Revenue Act Telangana: నూతన రెవెన్యూ చట్టంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ
రిటైర్డ్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ నర్సింహా రెడ్డి భూతగాదాల్లో తలదూర్చి భారీ మొత్తంలో అవినీతి సొమ్ము వెనకేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రూ. 50 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ( ACB sleuths ) గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు తమ వద్ద ఉన్న స్పష్టమైన సమాచారంతో హైదరాబాద్లోని మహేంద్రహిల్స్, ఉప్పల్, డీడీ కాలనీ, అంబర్పేట, కరీంనగర్లో 2 చోట్ల, నల్లగొండలో 2 చోట్ల, వరంగల్లో 3 చోట్ల, అనంతపురంలోని నర్సింహా రెడ్డి బంధువుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే మొత్తం ఆరు చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఇటీవల కీసర తహశీల్దార్ నాగరాజు ( Keesara Tahsildar Nagaraju ), ఆ తర్వాత మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ని ( Medak dist additional collector Gaddam Nagesh ) రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. ఆ రెండు ఘటనల్లో భారీ మొత్తంలో నగదు, నగలు, విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. Also read : Telangana: కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు