Aadhaar Number: ఇక పుట్టిన వెంటనే ఆధార్‌..ఆ దిశగా ముమ్మర చర్యలు..!

Aadhaar Number: ఆధార్‌ ..మన జీవితంలో భాగమయిపోయింది. ఏ పని జరగాలన్న ఆధార్ తప్పనిసరి అయ్యింది. ప్రభుత్వ పథకాల్లో మాత్రం ఆధార్ కీలకంగా మారుతోంది. ఈక్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

Written by - Alla Swamy | Last Updated : Jun 17, 2022, 12:30 PM IST
  • పుట్టిన వెంటనే చిన్నారులకు ఆధార్‌ నెంబర్
  • పైలట్ ప్రాజెక్ట్‌గా కొన్ని ఆస్పత్రుల ఎంపిక
  • అధికారికంగా వెల్లడించిన అధికారులు
Aadhaar Number: ఇక పుట్టిన వెంటనే ఆధార్‌..ఆ దిశగా ముమ్మర చర్యలు..!

Aadhaar Number: ఆధార్‌ ..మన జీవితంలో భాగమయిపోయింది. ఏ పని జరగాలన్న ఆధార్ తప్పనిసరి అయ్యింది. ప్రభుత్వ పథకాల్లో మాత్రం ఆధార్ కీలకంగా మారుతోంది. ఈక్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి పుట్టిన వెంటనే ఆధార్ నెంబర్ కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఆస్పత్రిలో పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ నెంబర్ కేటాయించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌ కింద సంగారెడ్డి ఎంసీహెచ్, జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఈమేరకు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అప్పుడే పుట్టిన చిన్నారులకు తల్లి వేలిముద్ర తీసుకుని శిశువు ఫోటోను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. తాత్కాలిక యూఐడీని కేటాయిస్తారు.

ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఆధారంగా 45 రోజుల తర్వాత మీసేవ కేంద్రాల్లో శిశువు పేరు నమోదు చేసి..ఆధార్‌ డౌన్‌లోడ్ చేసుకునే వీలు ఉంది. ఇటు ఇంటి వద్దే ఆధార్ సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌లో సమాచారం ఇచ్చినా..పోస్టుమెన్‌కు ఫోన్ చేసినా..వారే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారు. ఈప్రక్రియ కోసం చిన్నారుల బర్త్‌ సర్టిఫికెట్, తల్లిదండ్రుల బయోమెట్రిక్ వివరాలను అందించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఆధార్‌ కార్డు అందిస్తారు. పోస్టల్ శాఖ ఈసేవలను ఉచితంగా అందిస్తోందని అధికారులు తెలిపారు.

Also read: Corona Updates in India: భారత్‌లో ఫోర్త్ వేవ్ బెల్స్..పెరుగుతున్న రోజువారి కేసులు..!

Also read:Secunderabad Agnipath Protests: 'అగ్నిపథ్' నిరసనలు హింసాత్మకం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News