Trainee Aircraft crashes in Nalgonda: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో (Nalgonda district) శిక్షణ విమానం (Training aircraft) కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం జిల్లాలోని పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలో రామన్నగూడెం తండా వద్ద చోటుచేసుకుంది. ఈ శిక్షణ విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో దట్టమైన మంటలు వ్యాపించాయి.
శిక్షణకు ఉపయోగించే విమానం ఒక్కసారిగా కిందపడటంతో నుజ్జునుజ్జుయింది. ప్రమాద సమయంలో మహిళా పైలెట్ తో సహా ట్రైనింగ్ పైలెట్ ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యుత్ స్థంభంపై విమానం కూలడంతో భారీగా మంటలు వ్యాపించాయని స్థానికులు వెల్లడించారు.
కుప్పకూలిన విమానం ఫ్లైటెక్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా152 (CESSNA-152) మోడల్ టూ సీటర్ చాపర్ గా తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే శిక్షణ విమానం కుప్పకూలింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఏవియేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read: Helicopter Crash: సడన్ గా బీచ్లో కుప్పకూలిన హెలికాప్టర్, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook