Whatsapp Latest Update: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వీడియో కాల్ లిమిట్ పెంపు

Whatsapp Video Calling Limit: వాట్సాప్ మరో కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీడియో కాలింగ్ లిమిట్‌ను పెంచడంతోపాటు కాంటాక్ట్స్‌లో నంబరు సేవ్ చేయకుండానే మెసేజ్ పంపించే సౌకర్యం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2023, 10:56 AM IST
Whatsapp Latest Update: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వీడియో కాల్ లిమిట్ పెంపు

Whatsapp Video Calling Limit: ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్‌తో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది వాట్సాప్. తాజాగా మరో ఫీచర్‌ను యూజర్స్‌కు పరిచయం చేస్తోంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కొత్త కాలింగ్ ఆప్షన్‌ను అప్‌డేట్‌లోకి తీసుకువస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా ఒకేసారి 15 మందితో వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. కుటుంబం అంతా లేదా.. స్నేహితులు కలిసి హ్యాపీగా వీడియో కాల్‌లో సంభాషించుకోవచ్చు. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ టెస్టింగ్ వర్షన్‌లో ఉంది. త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. అప్‌డేట్‌ రాగానే.. మీకు వాట్సాప్‌ స్టాటస్‌లో నోటిఫికేషన్ వస్తుంది.

గతేడాది ఏప్రిల్‌లో వాట్సాప్ 'గ్రూప్ కాలింగ్' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసిన విషయం విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌తో గరిష్టంగా 32 మందికి ఒకేసారి కాల్ చేసుకునే సదుపాయం కల్పించారు. ప్రస్తుతం వినియోగదారులు ఒకేసారి ఏడుగురికి వీడియో కాల్ చేసే సదుపాయం ఉండగా.. కొత్త అప్‌డేట్‌తో ఈ సంఖ్యను 15కి పెంచింది. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్‌ ఆండ్రాయిడ్ బేటా 2.23.15.14 గూగుల్ ప్లే స్టోర్‌లో అప్‌డేట్‌ చేయనుంది. ఈ అప్‌డేట్ ఇతర వినియోగదారులకు కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్.

అదేవిధంగా వాట్సాప్ కొత్త యానిమేటెడ్ అవతార్ ఫీచర్‌ని పరిచయం చేసింది. ఈ ఫీచర్ iOS, Android వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌తో మీరు చాట్ చేసే సమయంలో యానిమేటెడ్ అవతార్‌ను క్రియేట్ చేసేందుకు పర్మిషన్ ఇస్తుంది. అవతార్‌కు దుస్తులు, హెయిర్‌తో మీకు నచ్చిన డిజైన్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. మీ చాట్‌లో మరింత అనుభూతిని అందించి.. సరదాగా చాట్ చేసుకునేందుకు ఈ అవతార్‌లు ఉపయోగపడనున్నాయి. ఫ్రెండ్స్‌తో ఎక్కువ కనెక్ట్ అయ్యేందుకు అవతార్‌లు మంచి ఫీచర్‌గా నిపుణులు చెబుతున్నారు.

వీటితోపాటు వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కాంటాక్ట్స్‌లో నంబరు సేవ్ చేయకుడానే వాట్సాప్‌లో మెసేజ్ పంపించే సదుపాయం కల్పించింది. 'న్యూ చాట్ స్టార్ట్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి.. మీరు చాట్ చేయాలనుకున్న నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆ నంబరుపై క్లిక్ చేసి చాట్‌ను ప్రారంభించవచ్చు. ఈ కొత్త అప్‌డేట్ వాట్సాప్ తాజా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఈ అప్లికేషన్ అప్‌డేట్ చేసుకుని వినియోగించుకోవచ్చు. 

Also Read: హాలీవుడ్ రేంజ్‌లో 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ గ్లింప్స్.. టైటిల్ ఏంటో తెలుసా?

Also Read: Hyderabad Rains: హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షపాతం.. అవస్థలు పడుతున్న జనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News