Realme P1 - Realme P1 Pro: 256GB స్టోరేజ్‌ Realme P సిరీస్‌ మొబైల్స్‌ రూ. 17 వేల లోపే పొందండి!

Realme P1 - Realme P1 Pro: రియల్‌ మీ (Realme) తమ కస్టమర్స్‌కి శుభవార్త తెలిపింది. ఇటీవలే లాంచ్‌ అయిన Realme P1, Realme P1 Pro స్మార్ట్‌ఫోన్స్‌పై త్వరలోనే ప్రత్యేమైన సేల్‌ను ప్రారంభించబోతోంది. అయితే ఈ సేల్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 18, 2024, 03:17 PM IST
Realme P1 - Realme P1 Pro: 256GB స్టోరేజ్‌ Realme P సిరీస్‌ మొబైల్స్‌ రూ. 17 వేల లోపే పొందండి!

 

Realme P1 - Realme P1 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపనీ రియల్‌ మీ (Realme) ఏప్రిల్ 15న మార్కెట్‌లోకి P సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌కి మార్కెట్‌లో మంచి స్పందన లభించింది. అలాగే వీటీ సేల్స్‌ కూడా విపరీతంగా పెరిగాయి. అయితే ఈ మొబైల్స్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం వల్ల యువత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ సిరీస్‌ Realme P1, Realme P1 Pro అనే రెండు మోడల్స్‌లో లభిస్తోంది. అయితే వీటిని రూ.20లోపే కొనుగోలు చేయాలనుకునేవారికి త్వరలోనే రియల్‌ మీ గుడ్‌ న్యూస్‌ అందించబోతోంది. ఈ రెండు మొబైల్స్‌పై ప్రత్యేకమైన సేల్ ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ సేల్‌ మే 21న ప్రారంభం కాబోతోంది. ఈ స్పెషల్ సేల్ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు 12 గంటలపాటు వరకు అందుబాటులో ఉంటుంది.

Realme P1 Pro 5G సేల్‌లో ఆఫర్స్‌:
ఈ Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై సేల్ realme.comతో పాటు ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ‌8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో పాటు 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా రూ.1,000 వరకు బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.17,999కే ఈ కొత్త మొబైల్‌ను పొందవచ్చు. ఇక 256 GB స్టోరేజ్ వేరియంట్  ధర రూ.21,999కే లభిస్తోంది. 

Realme P1 Pro ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ Realme P1 Pro స్మార్ట్‌ఫోన్‌ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 6.7-అంగుళాల FHD+ OLED కర్వ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే దీని స్క్రీన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 5G ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ 14పై పని చేస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా వివరాల్లోకి వెళితే, ఇది 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు Sony LYT-600 సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే 8MP అల్ట్రావైడ్ సెకండరీ కెమెరాతో రాబోతోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 5000mAh బ్యాటరీతో లభిస్తోంది. ఇది  45W SUPERVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వచ్చింది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ బోలెడు ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News