Realme C53 Price Cut: ఎప్పటి నుంచో రూ.10 వేల లోపే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ రియల్మీ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. Realme అధికారిక వెబ్సైల్లో డెడ్ చీప్ ధరకే మంచి మొబైల్స్ లభిస్తాయి. ముఖ్యంగా రియల్ మీ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఇటీవలే మార్కెట్లోకి అందుబాటులో వచ్చిన Realme C53 స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. 108 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ప్రస్తుతం 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీనిని అదనపు తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారు ప్రత్యేమైన కూపన్‌ను వినియోగించి రూ. 500 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు MobiKwikతో బిల్ చెల్లించిన దాదాపు ధర రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Realme C53 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్:
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ ఈ Realme C53 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది 1600 x 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడా డిస్ల్పేతో వస్తోంది. దీంతో పాటు ఇది 6.74 అంగుళాల HD+ LCD ప్యానెల్ డిస్ల్పే సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ల్పే గరిష్ట ప్రకాశం స్థాయి 560 నిట్లను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ మొబైల్ గరిష్టంగా 6 GB LPDDR4x ర్యామ్‌తో పాటు, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది డైనమిక్ ర్యామ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్ మాలి G57 GPUతో Unisoc T612 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెటప్‌తో లభిస్తోంది. అలాగే బ్యాక్ సెటప్‌లో LED ఫ్లాష్ కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు సెల్ఫీ కోసం AI 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా 5000mAh బ్యాటరీ సెటప్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. అలాగే అదనంగా 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇతర ఫీచర్స్:
ఆండ్రాయిడ్ 13 ఆధారంగా Realme UI
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
4G, Wi-Fi, బ్లూటూత్, GPS
డ్యూయల్ సిమ్
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
ఛాంపియన్ గోల్డ్ కలర్
ఛాంపియన్ బ్లాక్ కలర్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి