Poco M6 Pro 5G Suddenly Price Dropped: అతి తక్కువ ధరలోనే మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక సేల్ ప్రకటించింది. గత సంవత్సరంలో టెక్ కంపెనీలు విడుదల చేసిన మొబైల్స్ పై దాదాపు 31 శాతం వరకు తగ్గింపుతో విక్రయిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా ప్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ముఖ్యంగా POCO ఇటీవలే లాంచ్ చేసిన M6 Pro 5G మోడల్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఈ POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడు స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం 4GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో MRP రూ.15,999తో అందుబాటులో ఉంది. ఇక 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర రూ.17,999తో లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.10,000కే పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
ఈ స్మార్ట్‌ఫోన్ 5G కనెక్టివిటీతో మార్కెట్‌లోకి అందుబాటులో వచ్చింది. దీంతో పాటు ఇది సైడ్-మౌన్టెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా3.5mm హెడ్‌ఫోన్ జాక్, IR బ్లాస్టర్ వంటి అధునాత ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ మొబైల్ 8MP ఫ్రంట్ కెమెరా, 5,000mAh బ్యాటరీలో మార్కెట్‌లోకి వచ్చింది. దీంతో పాటు ఈ మొబైల్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇవే కాకుండా చాలా రకాల ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
6.79 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్
స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్
Android 13 + MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్
రెండు OS అప్‌డేట్స్
మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు
మూడు 64GB, 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్
50MP ప్రధాన సెన్సార్ + 2MP డెప్త్ సెన్సార్ కెమెరా
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter