POCO Smartphone: పోకో నుంచి మరో కొత్త ఫోన్, 6 జీబీ ర్యామ్, 5000 mAh బ్యాటరీతో కేవలం 7500 రూపాయలే

POCO Smartphone: దేశంలో గత కొద్దికాలంగా POCO స్మార్ట్‌ఫోన్లకు ఆదరణ పెరుగుతోంది. సరికొత్త ఫీచర్లు, అందుబాటు ధర ఇందుకు కారణం. ఇప్పుడు మరో కొత్త వేరియంట్ లాంచ్ కానుంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ అయితే అతి తక్కువ ధరకే అందుబాటులో రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2024, 01:26 PM IST
POCO Smartphone: పోకో నుంచి మరో కొత్త ఫోన్, 6 జీబీ ర్యామ్, 5000 mAh బ్యాటరీతో కేవలం 7500 రూపాయలే

POCO Smartphone: POCO లాంచ్ చేయనున్న కొత్త స్మార్ట్‌ఫోన్ POCO C61. మార్చ్ 26వ తేదీన భారత మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన ర్యామ్, కెమేరా, బ్యాటరీ, డిజైన్, ధర వంటి వివరాలు లీక్ అవడం వల్ల ఈ ఫోన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

పోకో గత ఏడాది విడుదల చేసిన పోకో సి51 కు నెక్ట్స్ జనరేషన్ ఫోన్ పోకో సి61. బ్లాక్, బ్లూ, గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ సన్నటి డిజైన్ కలిగి ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి 6.71 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ త్వరగా డ్యామేజ్ కాకుండా ఉండేందుకు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. మీడియాటెక్ హీలియో జి36 ఎస్ఓసి చిప్‌సెట్ ఉంటుంది. యూఎస్‌బి సి టైప్ ఛార్జింగ్ పోర్టు ఉండి 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ అయితే అత్యధికంగా 5000 ఎంఏహెచ్ ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో సర్కిల్ ఆకారంలో కెమేరా సెటప్ ఉంటుంది. ఇందులో 8 మెగాపిక్సెల్ కెమేరా, 0.08 సెకండరీ కెమేరా ఉంటాయి ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 

పోకో సి61 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఒకటి 4 జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజ్ అయితే రెండవది 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్. పోకో సి61 4జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర కేవలం 7,499 రూపాయలు మాత్రమే. ఇందులోనే 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. పోకో నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. రెడ్‌మి ఎ3 ఫోన్‌కు ప్రత్యామ్నాయం కావచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ నుంచి 6 జీబీ ర్యామ్ , సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వంటి ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ కేవలం 7500 రూపాయలకే లభించడం గొప్ప విషయమే. 

Also read: Moscow Gun Firing: మాస్కోలో దారుణం, దుండగుల కాల్పుల్లో 40 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News