Unbreakable Laptop: పై నుంచి విసిరికొట్టినా పగలని అన్‌బ్రేకబుల్ ల్యాప్‌టాప్

Unbreakable Laptop: మార్కెట్‌లో చాలా రకాల ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ఈ ల్యాప్‌టాప్ అన్నింటికంటే భిన్నమైంది. పైనుంచి విసిరి కొట్టినా ఏ మాత్రం పగలని ల్యాప్‌టాప్ ఇది. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2024, 03:32 PM IST
Unbreakable Laptop: పై నుంచి విసిరికొట్టినా పగలని అన్‌బ్రేకబుల్ ల్యాప్‌టాప్

Unbreakable Laptop: హెచ్‌పి, డెల్, ఏసస్, లెనోవా, ఎంఐ, ఆపిల్, శాంసంగ్ ఇలా కంపెనీల జాబితా చాలా పెద్దదే ఉంటుంది. ఈ అన్ని కంపెనీల ల్యాప్‌టాప్‌లకు మార్కెట్‌లో ఆదరణ ఎక్కువే. వీటన్నింటికంటే ప్రత్యేకంగా Panasonic సరికొత్త ల్యాప్‌టాప్ లాంచ్ చేసింది. ఇది ఎంత ధృడంగా ఉంటుందంటే పై నుంచి గిరాటేసి విసిరికొట్టినా పగలదు. నమ్మలేకున్నారా...

Panasonic కొత్తగా లాంచ్ చేసిన ఈ ల్యాప్‌టాప్ రఫ్ అండ్ టఫ్ వాడకానికి పనిచేస్తుంది. బహుశా అందుకే కంపెనీ ఈ ల్యాప్‌‌టాప్‌కు టఫ్‌బుక్ అని పేరుపెట్టింది. Toughbook 40 Mk 2 పేరుతో లాంచ్ అయినా ఈ ల్యాప్‌టాప్ చాలా ధృడంగా ఉంటుంది. గతంలో లాంచ్ చేసిన Toughbook 40కు ఇది సెకండ్ జనరేషన్ మోడల్. ఈ ల్యాప్‌టాప్ 6 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా పగలదు. నీట్లో పడినా ఏం కాదు. అద్భుతమైన ప్రోసెసింగ్ పవర్, డ్యూరబిలిటీ ఈ ల్యాప్‌టాప్ సొంతం. టఫ్ బుక్ 40 ఎంకే 2  మెటియోర్ కోర్ అల్ట్రా ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 14 ఇంచెస్ హెచ్‌డి ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 1200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. అంటే ఎండలో కూడా విజిబిలిటీ బాగుంటుంది. గ్లోవ్స్ తొడిగినా టచ్ స్క్రీన్ పనిచేస్తుంది. 

ఈ ల్యాప్‌టాప్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. టఫ్‌బుక్ 40 ఎంకే2 అడ్వాన్స్డ్ ఇంటెల్ BE200, వైఫై 7 కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 4జి లేదా 5జి నెట్‌వర్క్‌తో పనిచేస్తుంది. ఇందులో ఇ సిమ్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం. మిలిటరీ ప్రమాణాలతో సర్టిఫై అయింది. ఐపీ 66 రేటింగ్ కావడంతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేస్తుంది. అంటే మైనస్ 20 డిగ్రీల నుంచి 63 డిగ్రీల వరకూ తట్టుకోగలదు. 

ఈ ల్యాప్‌టాప్ మాడ్యులర్ డిజైన్ కలిగి ఉంటుంది. బ్యాటరీ, స్టోరేజ్, మెమరీ వంటి ఫీచర్లు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 54.4 ఎంఎం మందం, 3.35 కిలోల బరువుతో ఉంటుంది. ఇందులో ఇన్ బిల్ట్ 68 వాట్స్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 12 గంటలు నిర్విరామంగా పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర 4 లక్షల వరకూ ఉంటుంది. 

Also read: Samsung Galaxy S23 Offer: 50MP ట్రిపుల్ కెమేరా, 8GB ర్యామ్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సగం ధరకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News