Oppo Reno 8t 5g: Oppo రెనో 8 సిరీస్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఒప్పోలో అత్యధికంగా అమ్ముడుపోయిన సిరీస్లో రెనో 8 సిరీస్ ఒకటి. అయితే రెనో 8 సిరీస్ సిరీస్ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతోందని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ Oppo Reno 8T అనే పేరుతో మార్కెట్లోకి రాబోతోందని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చెక్కర్లుకొట్టాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫీచర్లు కూడా లీక్ అయ్యాయని సమాచారం. Oppo Reno 8Tకి సంబంధించిన ఫీచర్లు ఇతర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్మార్ట్‌ఫోన్ 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో పాటు HD + రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. దీనితో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫీచర్ కూడా అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ఫీచర్లకు సంబంధించిన సమాచారాన్ని Tipster SnoopyTech సోషల్ మీడియాలో పేర్కొంది. ఇక కెమెరా విషయానికొస్తే..100-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ మోనో లెన్స్‌తో మార్కెట్లో లభించనుంది. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 32-మెగాపిక్సెల్ హై క్వాలిటీ కెమెరా కలిగి ఉంటుంది.
ప్రత్యేకమైన ఫీచర్లు ఇవే:
రెనో 8T FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో విజువల్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. సూపర్‌వూక్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా IPX54 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ కూడా లభిస్తోంది. Oppo Reno 8T ఆండ్రాయిడ్ 13 ఆధారిత ColorOS 13పై పనిచేయానుంది.
Oppo Reno 8T ధర:
భారత మార్కెట్లో ఈ Oppo Reno 8T ఫిబ్రవరి రెండో వారంలో లాంచ్ చేయనుంది. ఇక దీని రేటు విషయానికొస్తే.. రూ. 32 వేల రూపాయలు ఉండవచ్చని అంచనాలు. అయితే త్వరలోనే ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలను వివరించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మరో కొన్ని స్మార్ట్ ఫ్యూచర్ లను తీసుకురాబోతున్నట్లు సమాచారం.
Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook