Oppo A60 4G: శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో Oppo A60 మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌!

Oppo A60 4G: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Oppo A60 4G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది 90Hz LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 25, 2024, 03:27 PM IST
Oppo A60 4G: శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో Oppo A60 మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌!

 

Oppo A60 4G: ఎప్పటి నుంచో ఒప్పోలో అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే భారత మార్కెట్‌లో Oppo A60 4G పేరుతో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. లాంచింగ్‌కి ముందే Google Play కన్సోల్‌లో కనిపించింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. ఇది అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు కంపెనీ దీనిని ఒక స్టోరేజ్‌ వేరియంట్‌లో విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ Oppo A60 4G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 90Hz డిస్‌ప్లే సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ ఇటీవలే ప్రముఖ టెక్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌లో లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఫ్రాంట్‌ సెటప్‌లో పంచ్ హోల్ కటౌట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 90Hz LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని స్క్రీన్‌ 1604×720 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ డిస్ల్పే 950 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 264 PPI పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
Oppo A60 4G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో రాబోతోంది. దీంతో పాటు 8జిబి ర్యామ్‌, 128జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు బ్యాక్‌ సెటప్‌లో ఈ మొబైల్ ట్రిపుల్‌ కెమెరాతో విడుదల కాబోతోంది. ఇది 50MP+8MP+2MPగా కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 5000mAh బ్యాటరీ కెపాసిటీతో రాబోతోంది. అంతేకాకుండా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇతర ఫీచర్స్‌:
ఫింగర్‌ప్రింట్ స్కానర్
మైక్రో SD కార్డ్ స్లాట్‌
3.5mm హెడ్‌ఫోన్ జాక్‌
USB-C 2.0 సపోర్ట్
Wi-Fi 6 సపోర్ట్
Android 14 ఆధారిత ColorOS 14.0.1
186 గ్రాముల బరువు

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News