Oneplus Nord 3 5G, Oneplus Nord CE 3 5G: వన్‌ప్లస్ నుంచి మరో రెండు సూపర్ స్మార్ట్‌‌ఫోన్స్

Oneplus Nord 3 5G, Oneplus Nord CE 3 5G Launched In India: ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ నుంచి కొత్తగా వన్‌ప్లస్ నార్డ్ 3, వన్‌ప్లస్ నార్డ్ CE 3 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇదివరకు రిలీజైన మోడల్స్‌లో లేని కొన్ని బెస్ట్ ఫీచర్స్‌ని పరిచయం చేయడం లక్ష్యంగా కంపెనీ ఈ రెండు మోడల్స్‌ని లాంచ్ చేసింది.

Written by - Pavan | Last Updated : Jul 6, 2023, 10:21 PM IST
Oneplus Nord 3 5G, Oneplus Nord CE 3 5G: వన్‌ప్లస్ నుంచి మరో రెండు సూపర్ స్మార్ట్‌‌ఫోన్స్

Oneplus Nord 3 5G, Oneplus Nord CE 3 5G Launched In India: ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ నుంచి కొత్తగా వన్‌ప్లస్ నార్డ్ 3, వన్‌ప్లస్ నార్డ్ CE 3 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇదివరకు రిలీజైన మోడల్స్‌లో లేని కొన్ని బెస్ట్ ఫీచర్స్‌ని పరిచయం చేయడం లక్ష్యంగా కంపెనీ ఈ రెండు మోడల్స్‌ని లాంచ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్‌ని ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం కాగా నార్డ్ CE 3 డైలీ యూజ్ తరహాలో ఉపయోగించుకునే వారి కోసం డిజైన్ చేశారు. కొత్తగా లాంచ్ అయిన ఈ రెండు మోడల్ ఫోన్స్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి.

వన్‌ప్లస్ నార్డ్  3 మోడల్ ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే.. 6.74-అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ 10 బిట్ ఫ్లాట్ 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 1,000Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 1450 నిట్స్ మ్యాగ్జిమం బ్రైట్‌నెస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అల్యూమినియం మిడ్-ఫ్రేమ్‌ డిజైన్ తో రూపొందిన ఈ ఫోన్ ప్రీమియం బిల్ట్ లుక్ ని పోలి ఉంటుంది.

కెమెరా స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడిన 50MP సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్‌ కెమెరా ఉంది. అలాగే, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్‌ కెమెరాలు సైతం అమర్చారు. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే., ఫోన్ డిస్‌ప్లే పై భాగం నడి మధ్యలో 16MP పంచ్ హోల్  కెమెరా వస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 3, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌ ఆధారంగా పని చేసే ఈ ఫోన్‌లో 16GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్‌ లభిస్తుంది.

నాన్-స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ కోసం ఫోన్‌లో 5,000mAh మాసివ్ బ్యాటరీని అమర్చారు. అలాగే ఈ బ్యాటరీని సపోర్ట్ చేసేలా 80W ఫాస్ట్ ఛార్జర్ లభిస్తోంది. 5G నానో సిమ్ కార్డుతో పాటు 12 రకాల 5G బ్యాండ్స్‌కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3, Wi-Fi 6. వన్‌ప్లస్ నార్డ్ 3 ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సీజన్ ఓఎస్ 13.1 తో పని చేస్తుంది. 

వన్ ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ ఫీచర్స్ :
ఇది 6.7 అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. వన్ ప్లస్ నార్డ్ CE 3 మీడియం లెవెల్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగాన్ 782G చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఇది మ్యాగ్జిమం 8GB RAM + 256GB వరకు స్టోరేజ్‌ని అందిస్తుంది. రోజువారీ అవసరాల కోసం ఫోన్ కొనే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే.. వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ తరహాలోనే వన్ ప్లస్ నార్డ్ CE 3 కూడా అదే రకమైన కెమెరా సెటప్‌తో వస్తోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్స్‌తో 50MP సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్‌ కెమెరా కూడా ఉంది.

Trending News