Oneplus 12R Vs Oneplus 11R 5G: విడుదలైన అతికొద్ద రోజుల్లోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ మొబైల్‌కి మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ కూడా ప్రీమియం రేంజ్ లో కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరల్లో విక్రయిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన వన్‌ప్లస్ 11 మోడల్స్ కూడా అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వన్‌ప్లస్ 11r 5g స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రావడం వల్ల చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో భాగంగా గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 12r 5g మొబైల్‌తో పోటీ పడుతోంది. ఈ రెండు మొబైల్స్ శక్తివంతమైన ఫీచర్స్‌తో బడ్జెట్ ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ పరంగా ఈ రెండు మొబైల్స్ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడా ఏంటో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, బ్యాటరీ డిస్ప్లే పరంగా ఏది బెస్టో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ 11r 5g, వన్‌ప్లస్ 12r 5g మధ్య ప్రధాన తేడాలు:
ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మధ్య అనేక తేడాలు ఉన్నాయి ముఖ్యంగా వీటి రెండిటి ప్రాసెసర్, ఇతర ఫీచర్స్ పరిశీలించి చూస్తే..వన్‌ప్లస్ 11r 5g స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ 6.7-అంగుళాల AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్టుతో లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే, ఇది ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో పాటు 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో లభిస్తోంది. ఇక వన్‌ప్లస్ 12r 5g స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళితే.. ఇది MediaTek Dimensity 8100-Max ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 6.7-అంగుళాల AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్టుతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే, 50MP Sony IMX766 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా త్రిపుల్ కెమెరా సెట్ అప్ తో లభిస్తుంది.
ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ డిజైన్ విషయానికొస్తే.. వన్‌ప్లస్ 11r 5g స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్, గ్లాస్ సిస్టంతో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్ 8GB, 12GB, 16GB ర్యామ్, 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది 5G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFC కనెక్టివిటీలను కలిగి ఉంది. ఇక 12R మొబైల్ వివరాల్లోకి వెళితే, కర్వ్డ్ ఫ్రేమ్ డిజైన్, ఫ్రంట్ భాగంలో గ్లాస్, బ్యాక్ సెటప్‌లో ప్లాస్టిక్ మెటల్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB,12GB ర్యామ్, 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ లలో లభిస్తోంది. దీంతోపాటు 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC కనెక్టివిటీలతో అందుబాటులో ఉంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే..వన్‌ప్లస్ 11r 5g స్మార్ట్ ఫోన్ Android 13, OxygenOS 13 పై రన్ అవుతాయి. అలాగే, ఈ మొబైల్ ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీలో ధర రూ. 39,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక 12R స్మార్ట్ ఫోన్ వివరాల్లోకి వెళితే, Android 12, OxygenOS 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. దీని ధర రూ. 34,999 నుండి మొదలవుతుంది. ఇక ఈ రెండింటిలో ఏ మొబైల్ బెస్ట్ అంటే..OnePlus 11R, 12R రెండూ మంచి ఫోన్‌లు, కానీ కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. 11Rలో మరింత శక్తివంతమైన ప్రాసెసర్, 100W ఫాస్ట్ చార్జింగ్, తాజా ఆండ్రాయిడ్ వెర్షన్ ఉంది. 12Rలో పెద్ద బ్యాటరీ, ప్రీమియం డిజైన్ ను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రీమియం రేంజ్‌లో కొనుగోలు చేయాలనుకునేవారు 12R మొబైల్ మంచి ఎంపికగా భావించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి