Motorola Fusion 30 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు.. Motorola Fusion 30పై రూ.33,500 తగ్గింపు..

Motorola Fusion 30 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్‌ మొబైల్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 9, 2024, 10:46 AM IST
Motorola Fusion 30 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు.. Motorola Fusion 30పై రూ.33,500 తగ్గింపు..

Motorola Fusion 30 Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటరోలా ఇటీవలే ఎడ్జ్ 30 ఫ్యూజన్‌ మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో బడ్జెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ అతి శక్తివంతమైన కెమెరాతో లభిస్తోంది. అలాగే ఇది స్టైలీస్‌ డిజైన్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్‌ మొబైల్‌ను ఎలా కొనుగోలు భారీ తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

ప్రస్తుతం ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 30 Fusion స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఒక స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.  8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన బేస్ మోడల్ ధర MRP రూ.49,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోల చేసేవారికి 30 శాతం తగ్గింపుతో కేవలం రూ. 34,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ మొబైల్‌పై ఉన్న క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా దాదాపు 5 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. 

అలాగే ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ బోనస్‌ను కూడా అందిస్తోంది. దీనిని పొందడానికి పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. మీరు వినియోగిస్తున్న పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.33,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.1,499కే పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్‌ బోనస్‌ అనేది పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటే ఎక్కువ ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది..

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
144Hz రిఫ్రెష్ రేట్‌
6.55-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే
1100నిట్‌ల గరిష్టమైన బ్రైట్‌నెస్‌
Qualcomm Snapdragon 888+ ప్రాసెసర్‌
IP52 రేటింగ్‌ సపోర్ట్‌
Dolby Atmos సపోర్ట్‌
50MP ప్రధాన కెమెరా
2MP డెప్త్ సెన్సార్‌ కెమెరా
13MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌
32MP సెల్ఫీ కెమెరా
4400mAh కెపాసిటీ బ్యాటరీ
68W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News