Motorola Edge 50 Ultra Price: స్మార్ట్‌ఫోన్ కస్టమర్స్‌కి ప్రముఖ టెక్ కంపెనీ మోటో గుడ్ న్యూస్ తెలిపింది. అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. మోటో కంపెనీ Edge 50 Ultra పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది Moto AIతో పాటు Smart Connect వంటి అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదటి సారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మంళవారం భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ మొబైల్ Qualcomm ప్రాసెసర్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Edge 50 అల్ట్రా ధర వివరాలు:
మోటరోలా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో దీని అసలు ధర రూ.59,999గా ఉంది. అయితే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి దాదాపు రూ.5000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.54,999కే లభిస్తుంది. అలాగే ఈ మోటో కంపెనీ ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 24 మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన మొదటి సేల్ కూడా అప్పుడే ప్రారంభమవుతుంది.
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్స్:
ఈ Motorola స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 6.7-అంగుళాల pOLED డిస్ప్లేలను కలిగి ఉంటుంది. దీంతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వచ్చింది. అలాగే ఈ డిస్ల్పే 2800 Nits బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా కంపెనీ డిస్ల్పే ప్రోటక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్‌ను కూడా అందిస్తోంది. ఈ మొబైల్ Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అలాగే 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు Android 14 ఆధారిత సాఫ్ట్వేర్ స్కిన్‌పై రన్ అవుతుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌లో AI ఆధారిత అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇతర ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ట్రిపుల్ కెమెరా సెటప్
50MP ప్రైమరీ లెన్స్ కెమెరా
50MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా
64MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కెమెరా
100x AI జూమ్ సపోర్ట్
50MP ఫ్రంట్ కెమెరా
4500mAh బ్యాటరీ
125W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి