iqoo z7 Pro 5G Phone: ఐకూ Z సిరీస్ నుండి మరో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది

128GB ఫోన్ ధర రూ. 23,999 కాగా డిస్కౌంట్ తరువాత రూ. 21,999 కే లభిస్తోంది. అలాగే 256GB ఫోన్ రూ. 24,999 కాగా డిస్కౌంట్ పోగా రూ. 22,999 కే లభిస్తోంది. ఇక కలర్ వేరియంట్స్ విషయానికొస్తే.. ఐకూ Z7 Pro 5G బ్లూ లగూన్, గ్రాఫైట్ మాట్ అనే రెండు కలర్స్ లో విక్రయాలకు సిద్ధంగా ఉంది.

Written by - Pavan | Last Updated : Aug 31, 2023, 11:40 PM IST
iqoo z7 Pro 5G Phone: ఐకూ Z సిరీస్ నుండి మరో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది

iQOO Z7 Pro 5G Price in India: స్మార్ట్ ఫోన్ మేకింగ్ కంపెనీ ఐకూ ఇండియాలో Z సిరీస్ పోర్ట్‌ఫోలియో నుండి ఐకూ Z7 ప్రో 5G పేరిట మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఐకూ Z7 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ ఆధారంగా ఆపరేట్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్ లో లభిస్తోంది. అందులో ఒకటి 8GB + 128GB వేరియంట్ కాగా మరొకటి 8G + 256GB వేరియంట్ ఫోన్. 

128GB ఫోన్ ధర రూ. 23,999 కాగా డిస్కౌంట్ తరువాత రూ. 21,999 కే లభిస్తోంది. అలాగే 256GB ఫోన్ రూ. 24,999 కాగా డిస్కౌంట్ పోగా రూ. 22,999 కే లభిస్తోంది. ఇక కలర్ వేరియంట్స్ విషయానికొస్తే.. ఐకూ Z7 Pro 5G బ్లూ లగూన్, గ్రాఫైట్ మాట్ అనే రెండు కలర్స్ లో విక్రయాలకు సిద్ధంగా ఉంది.

ఐకూ Z7 Pro మెయిన్ కెమెరా 64MP గా ఉంది. 3D కర్వ్డ్ 120Hz అమోల్డ్ డిస్‌ప్లేను అమర్చారు. వెనుక భాగంలో ఏజీ గ్లాస్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఫన్‌టచ్ ఆపరేటింగ్ సిస్టం 13 తో నడిచే ఈ ఫోన్ అదనంగా 8GB వర్చువల్ RAMని పొడిగించుకునేందుకు వీలు ఉంది. 

1300 నిట్స్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. ఐకూ Z7 Pro స్కాట్ క్సెన్సేషన్ యూపీ గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తోంది. Z7 ప్రో ఫోన్ 4600mAh బ్యాటరీతో , 66W ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీ కలిగిన చార్జర్ ని అందిస్తున్నారు. కేవలం 22 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 1 నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేయడానికి వీలు ఉంది. 

స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ ఆల్‌రౌండర్ స్మార్ట్‌ ఫోన్‌లో సరికొత్త Wi-Fi 6 పరిజ్ఞానాన్ని వినియోగించారు. డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్‌లో భాగంగా 16MP ఫ్రంట్ కెమెరాను, 2MP బోకె కెమెరాను అమర్చారు. 

ఇది కూడా చదవండి : Google Pixel 8 Pro Price: త్వరలోనే మార్కెట్లోకి Pixel 8 Pro మొబైల్..ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాపై DSLR కెమెరా కూడా పనికిరాదు..

మొత్తానికి కస్టమర్స్‌ని ఎప్పటికప్పుడు ఎట్రాక్ట్ చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తోన్న ఐకూ కంపెనీ తాజాగా లాంచ్ చేసిన ఐకూ Z7 ప్రో 5G ఫోన్‌తో తమ బ్రాండ్ విక్రయాలు ఇంకొంత పెంచుకోవచ్చని ఆశిస్తోంది. పైగా గతంలో వచ్చిన మోడల్స్‌తో పోల్చుకుంటే ఈసారి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకే ఐకూ మేకర్స్ ధరల విషయంలోనూ కొంత రాజీకి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : REDMI Note 12 Pro Price: రాఖీ స్పెషల్‌ ఆఫర్‌..Redmi Note 12 Proపై ప్రత్యేక తగ్గింపు..రూ.3,000లకే మొబైల్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News