Internet Speed: ఇంటర్నెట్ స్లోగా ఉందా..? ఈ చిన్న ట్రిక్ పాటించండి

Internet Speed Boost: ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉందని ఇబ్బంది పడుతున్నారా..? సిగ్నల్ సరిగా రావడం లేదా..? ఈ చిన్న ట్రిక్స్ పాటించి నెట్ స్పీడ్ పెంచుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2022, 10:36 AM IST
Internet Speed: ఇంటర్నెట్ స్లోగా ఉందా..? ఈ చిన్న ట్రిక్ పాటించండి

Internet Speed Boost: ప్రస్తుతం మనిషి ఆహారం లేకుండా అయినా కాసేపు ఉంటాడేమో గానీ.. ఇంటర్నెట్ లేకపోతే ఒక్కక్షణం కూడా ఉండలేడు. ఇంటర్నెట్ వినియోగం ఇటీవల భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్‌ వచ్చిన వెంటనే.. వైఫై ఓ రేంజ్‌లో ఉంది. చాలా మంది తమ కార్యాలయాలు, ఇళ్లలో వైఫై కనెక్షన్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఇంత బిజీ లైఫ్‌లో కాసేపు ఇంటర్నెట్ సిగ్నల్ నిలిచిపోయినా.. స్లోగా ఉన్నా ఎంతో వర్క్ పెండింగ్‌లో ఉండిపోతుంది.

మీరు కూడా ఇంటర్నెట్ స్పీడ్ సమస్య ఎదుర్కొంటున్నారా..? అయితే ఈ చిన్న ట్రిక్స్ పాటించి మీ నెట్ స్పీడ్‌ను పెంచుకోండి. అలాగే మీ పనిని వేగవంతంగా పూర్తి చేసుకోండి.

Wi-Fi రూటర్‌కు మీరు వాడుతున్న మొబైల్/ల్యాప్ టాప్ మధ్య దూరం ఎక్కువగా ఉంటే కచ్చితంగా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. మీరు రూటర్‌కు దగ్గరగా పని చేస్తే.. నెట్ వేగం మెరుగ్గా ఉంటుంది. దీంతో పాటు రూటర్‌ ఉన్న గది తలుపును మూసివేయడానికి బదులుగా.. దాన్ని తెరిచి ఉంచాలి. దీని ద్వారా సిగ్నల్‌కు ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది.

మీరు రూటర్ దగ్గర ఉన్నా.. నెట్ స్లో ఉంటే.. Wi-Fi ఫ్రీక్వెన్సీ, ఛానెల్‌ను చెక్ చేయండి. రూటర్ సెట్టింగ్‌లకు వెళ్లి మీ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ఇతర కనెక్షన్లు ఏవైనా ఉంటే వాటిని తొలగించండి. 

దీని తర్వాత మీరు వైర్‌లెస్ సెట్టింగ్‌లోకి వెళ్లి.. అక్కడ నుంచి అడ్వాన్స్ సెట్టింగ్‌లోకి వెళ్లండి. అక్కడ మీరు ఛానెల్‌ని ఎంచుకుని సెట్టింగ్‌ను సేవ్ చేయాలి. ఆ తరువాత రూటర్ పునఃప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల కొత్త సెట్టింగ్‌తో రూటర్ మళ్లీ యాక్టివేట్ అవుతుంది. అంతేకాకుండా మీ నెట్ స్పీడ్ కూడా పెరుగుతుంది. 

ఈ ట్రిక్ వాడిన తరువాత కూడా మీ ఇంట్లో సిగ్నల్ సమస్య ఉంటే.. ఇంటర్నెట్ ప్రొవైడర్‌కు కాల్ చేసి ఈ సమస్యకు కారణాన్ని తెలుసుకోండి. మీ రూటర్‌లో సమస్య వల్ల కూడా నెట్ స్లోగా ఉండోచ్చు. కొత్త రూటర్‌ను సెట్ చేసుకుంటే మీ వై-ఫై కనెక్షన్ వేగం పెరుగుతుంది. 

Also Read: IPL 2023: భారత ఆటగాళ్లను ఇతర లీగ్‌లలో ఆడనివ్వం.. కారణం చెప్పిన ఐపీఎల్ ఛైర్మన్‌!

Also Read: Earthquake Causes: భూకంపాలు ఎలా ఏర్పడతాయో తెలుసా..? అసలు కారణం ఇదే..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News