Shiv Shakti Site on Moon: చంద్రుడిపై ఆ స్థలానికి శివ శక్తి అనే పేరెలా వచ్చిందంటే..

Who Named Shiv Shakti Site on Moon and Why : ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై శివ శక్తి స్థల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది అని వచ్చిన వార్తలు కొంతమందిని ఆలోచనలో పడేశాయి. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ సైతం విమర్శిస్తూ వస్తోంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపిన స్థలాన్ని శివ శక్తి పాయింట్ అని పిలవడంపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వి స్పందిస్తూ.. ఇలా పేర్లు పెట్టుకోవడానికి చంద్రుడు ఏమైనా మన సొంతమా ? అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.

Written by - Pavan | Last Updated : Aug 27, 2023, 06:01 PM IST
Shiv Shakti Site on Moon: చంద్రుడిపై ఆ స్థలానికి శివ శక్తి అనే పేరెలా వచ్చిందంటే..

Who Named Shiv Shakti Site on Moon and Why : చంద్రుడిపై ల్యాండ్ అయిన ప్రగ్యాన్ రోవర్.. అక్కడి నుండి తీసిన ఫోటోలు, వీడియోలను విక్రమ్ ల్యాండర్ ద్వారా కిందకు పంపిస్తోందని చెబుతూ నిత్యం ఎన్నో ఆసక్తికరమైన అంశాలను భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో వెల్లడిస్తోంది. అంతేకాదు.. ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై శివ శక్తి స్థల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది అని వచ్చిన వార్తలు కొంతమందిని ఆలోచనలో పడేశాయి. చంద్రుడిపైకి.. అందులోనూ దక్షిణ దృవంపైకి వెళ్లడమే ఇదే తొలిసారి.. అలాంటిది అక్కడ ఒక స్థలానికి శివ శక్తి స్థలం అని పేరు పెట్టింది ఎవరు ? ఆ స్థలాన్ని ఎందుకు ఆ పేరుతో  పిలుస్తున్నారు ? చంద్రుడిపై ఒక స్థలానికి నామకరణం హక్కు మనకుందా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ సైతం విమర్శిస్తూ వస్తోంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపిన స్థలాన్ని శివ శక్తి పాయింట్ అని పిలవడంపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వి స్పందిస్తూ.. ఇలా పేర్లు పెట్టుకోవడానికి చంద్రుడు ఏమైనా మన సొంతమా ? అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. మన పెట్టే పేర్లు చూసి ప్రపంచం నవ్వుకుంటుంది అంటూ రషీద్ అల్వీ చేసిన వ్యాఖ్యలను బీజేపి తిప్పి కొట్టింది. రషీద్ అల్వీ వ్యాఖ్యలపై బీజేపి నేత గౌరవ్ భాటియా స్పందిస్తూ.. యూపీఏ ప్రభుత్వం హయాంలో చేపట్టిన చంద్రయాన్ 1 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై వాలిన ప్రదేశానికి ' జవహార్ ' అని పేరు పెట్టుకున్నప్పుడు ఈ బుద్ధి ఏమైంది అని ప్రశ్నించారు.  

చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల ఘనత గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే సమయంలో చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అని దిగిన ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్ అని అభివర్ణించిన సంగతి తెలిసిందే. అలాగే చంద్రయాన్ 2 కూలిన ప్రదేశాన్ని తిరంగ అని పిలిచిన సంగతి కూడా తెలిసిందే. ఐతే, చంద్రుడిపై ప్రదేశానికి శివ శక్తి అని పేరు పెట్టడం ఏంటంటూ కొంతమంది వాదిస్తోన్న వాదనలకు, సంధిస్తోన్న ప్రశ్నలపై తాజాగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ స్పందిస్తూ తనదైన స్టైల్లో వివరణ ఇచ్చారు. 

ప్రధాని మోదీ చెప్పినట్టుగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్ అని పిలవడంలో తప్పు ఏం ఉంది అని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఎదురు ప్రశ్నించారు. ప్రధాని మోదీ చెప్పినట్టుగానే ఆ ప్రదేశానికి ఆ పేరు సూట్ అవుతుందన్న సోమనాథ్.. ఆ ప్రదేశానికి నామకరణం చేసే స్థాయిలో ఉన్నారు కనుకే ప్రధాని ఆ పేరుతో పిలిచారు అని ప్రధాని మోదీ మాటలకు మద్దతుగా నిలిచారు. 

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయవంతం, విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ఫోటోలు మీ కోసం

అంతరిక్షంపై, చంద్రుడిపై పరిశోధనలు చేయడం తన పని అని చెప్పుకొచ్చిన సోమనాథ్.. వృత్తి ధర్మం కోసం ఆ పని చేస్తూనే ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఆత్మ సంతృప్తి కోసం గుళ్లు, గోపురాలకు వెళ్తుంటానని అన్నారు. శాస్త్రీయ పరిశోధనలు, ఆధాత్మికం.. రెండూ దేనికవేనన్న ఆయన.. రెండింటినీ ఒకే చోట కలిపి చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. శివ శక్తి స్థలం నామకరణంపై కాంగ్రెస్ పార్టీ, బీజేపి నేతల మధ్య జరుగుతున్న వివాదంలో కాంగ్రెస్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టుగానే స్పష్టంగా అర్థం అవుతోంది.

ఇది కూడా చదవండి : Aditya L1 Mission: సూర్యుడిపై ఇస్రో కన్ను.. ఆదిత్య L1 రాకెట్‌ ప్రయోగానికి సిద్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News