Flipkart Offers: 200MP ప్రైమరీ కెమేరా 50MP సెల్ఫీ కెమేరాతో కొత్త హానర్ 90, భారీ డిస్కౌంట్

Flipkart Offers: అద్భుతమైన ఫీచర్లు, శక్తివంతమైన కెమేరాతో మార్కెట్‌లో వచ్చిన హానర్ 90 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కెమేరా ఎంతో తెలిస్తే చాలు..వెంటనే కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 24, 2024, 11:23 AM IST
Flipkart Offers: 200MP ప్రైమరీ కెమేరా 50MP సెల్ఫీ కెమేరాతో కొత్త హానర్ 90,  భారీ డిస్కౌంట్

Flipkart Offers: మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి హానర్. ఇటీవల హానర్ 90 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రైమరీ కెమేరా, సెల్ఫీ కెమేరా ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. మార్కెట్‌లోని చాలా ఫోన్లు ఈ ఫోన్ ముందు దిగదుడుపే. ఈ ఫోన్ ప్రైమరీ కెమేరా ఏకంగా 200 మెగాపిక్సెల్ కాగా, సెల్ఫీ కెమేరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అందుకే ఈ ఫోన్ ముందు మరే స్మార్ట్‌ఫోన్ పనికిరాదు. 

హానర్ 90 5జి స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండి 1600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఇక స్క్రీన్ రిజల్యూషన్ 1200/2644 ఉంటుంది. ఇందులో త్రిబుల్ కెమేరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమేరా 200 మెగాపిక్సెల్ కాగా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ ఉండటంతో అద్భుతమైన ఫోటోలు మీ సొంతమౌతాయి. వీడియో కాలింగ్ కూడా మంచి అనుభూతినిస్తుంది. 

హానర్ 90 5జి స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తూ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఇందులో 8 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ ఉంటాయి. ఇందులో బ్యాటరీ 500 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ గ్రీన్, బ్లాక్, సిల్వర్ రంగుల్లో లభ్యం కానుంది. 

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై ఏకంగా 44 శాతం డిస్కౌంట్ లబిస్తోంది. 8 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 44 శాతం డిస్కౌంట్ అనంతరం 25, 499 రూపాయలకు లభిస్తోంది. ఈ ఆఫర్ కాకుండా ఇంకా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్ లభిస్తుంది. 

Also read: Gold at Indians: భారతీయుల వద్ద ఎంత బంగారం ఉంది, ఎంత తాకట్టు పెట్టారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News