iQoo Neo 9S Pro Plus: మార్కెట్‌లో చాలా కంపెనీల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. బడ్జెట్, మిడ్ రేంజ్, ప్రీమియం ఇలా అన్ని సెగ్మెంట్లలో ఫోన్లు ఉన్నాయి. మిడ్ రేంజ్ ఫోన్లకు ఈ మధ్యకాలంలో డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా iQoo సైతం మిడ్ రేంజ్ ఫోన్ చైనాలో లాంచ్ చేసింది. త్వరలో భారతీయ మార్కెట్‌లో రానుంది.
iQoo Neo 9S Pro Plus స్మార్ట్‌ఫోన్ 6.76 అంగుళాల ఎమోల్డ్ డిస్‌ప్లేతో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా స్క్రీన్ టు బాడీ రేషియో 93.43గా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రోసెసర్ ఉంది. బ్యాటరీ అయితే ఇతర మిడ్ రేంజ్ ఫోన్ల కంటే ఎక్కువే. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
iQoo Neo 9S Pro Plus ఫోన్‌లో కనెక్టివిటీ కూడా లేటెస్ట్ ఫీచర్లతో ఉంటుంది. వైఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్‌బి ఓటీజీ, ఎన్ఎఫ్‌సి, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, యూఎస్ బి టైప్ సి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఇక ఈ ఫోన్ ర్యామ్ కూడా ఎక్కువే. దాంతో ఫోన్ హ్యాంగింగ్ సమస్య ఉత్పన్నం కాదు. పనితీరు వేగంగా ఉంటుంది. ఇందులో 12 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్ కూడా ఉన్నాయి. ఇక ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంది.
iQoo Neo 9S Pro Plusలో 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 34 వేలుగా ఉంది. ఇందులోనే 512 జీబీ స్టోరేజ్ అయితే 39 వేలుగా నిర్ణయించారు. ఇక 16జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 42 వేల రూపాయలుంటుంది. ఇక ఇందులోనే 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే 46 వేలుంటుంది.
Also read: IT Returns Benefits: జీరో ఐటీఆర్ అంటే ఏమిటి, ఐటీ రిటర్న్స్‌తో కలిగే 4 అద్భుత ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook