Jio Unlimited Plan: ధర తక్కువ.. బెనిఫిట్స్‌ ఎక్కువ! ఈ జియో ప్లాన్‌ అద్భుతంగా ఉందిగా

Best Jio Recharge Plan, Reliance Jio Rs 299 plan. జియో సరికొత్త ప్లాన్ ధర రూ. 299 మాత్రమే. ఈ ప్లాన్‌లో 56 GB హై స్పీడ్ ఇంటర్నెట్‌ను కూడా మీరు పొందుతారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 22, 2022, 02:27 PM IST
  • ధర తక్కువ
  • బెనిఫిట్స్‌ ఎక్కువ
  • ఈ జియో ప్లాన్‌ అద్భుతంగా ఉందిగా
Jio Unlimited Plan: ధర తక్కువ.. బెనిఫిట్స్‌ ఎక్కువ! ఈ జియో ప్లాన్‌ అద్భుతంగా ఉందిగా

Cheapest Jio Recharge Plan: కస్టమర్లను ఆకట్టుకునేందుకు దేశంలోని పలు టెలికాం నెట్‌వర్క్‌లు నిత్యం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తక్కువ రీఛార్జ్‌తో ఎక్కువ బెనిఫిట్స్‌ వచ్చేలా ప్లాన్స్‌ ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో 'రిలయన్స్‌ జియో' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ఎన్నో ఆఫర్లను తీసుకువస్తుంటుంది. ఈ క్రమంలోనే జియో తన వినియోగదారుల కోసం చౌకైన  రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఆఫర్‌తో జియో కస్టమర్‌లు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ ప్లాన్ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం. 

జియో సరికొత్త ప్లాన్ ధర రూ. 299 మాత్రమే. ఈ ప్లాన్‌లో 56 GB హై స్పీడ్ ఇంటర్నెట్‌ను కూడా మీరు పొందుతారు. ఈ డేటా వీడియోలను ప్లే చేయడానికి మరియు ఇంటర్నెట్‌లో బ్రౌసింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు 28 రోజుల వాలిడిటీని పొందుతారు. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఇది చాలా ఉపయోగపడనుంది. సామాన్యులకు ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ భారం మోపదు. 

రూ. 299 ప్లాన్‌లో మంచి ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు 2GB ఇంటర్నెట్ మీరు వాడుకోవచ్చు. అలానే అపరిమిత వాయిస్ కాలింగ్ (దేశవ్యాప్తంగా ఎక్కడికైనా కాల్ చేసుకోవచ్చు). అంతేకాదు మీరు ప్రతిరోజూ 100 SMSలు కూడా ఉపయోగించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ మరియు జియో క్లౌడ్‌తో సహా జియోకు సంబందించిన పలు యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా అందిస్తుంది. ఈ జియో సరికొత్త ప్లాన్ డేటా సామాన్యులకు సరసమైన ధరలో ఉంటుంది. 

రూ. 299 ప్లాన్‌ ప్రయోజనాలు:

# 56 GB హై స్పీడ్ ఇంటర్నెట్‌
# అపరిమిత వాయిస్ కాలింగ్
# ప్రతిరోజూ 100 SMSలు
# 28 రోజుల వాలిడిటీ
# పలు యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం

Also Read: రూ. 1.2 లక్షల మ్యాక్‌బుక్ ప్రోని ఆర్డర్ చేస్తే.. బాక్స్ లోపల వచ్చింది చూసి షాక్ తిన్న అమెజాన్ కస్టమర్‌!  

Also Read: WhatsApp India: భారతీయులకు భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్.. 37 లక్షల ఖాతాలు బ్యాన్! మీది ఉందో చెక్ చేసుకోండి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News