/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Best Smartphones Under 15k: త్వరలోనే పండగ సీజన్ షురూ కాబోతోంది. ఈ సమయంలో కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అయితే ఈ సమయంలో మీరు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైం. మీ బడ్జెట్ రూ. 15వేల లోపు ఉన్నట్లయితే  మీకోసం బెస్ట్ బ్రాండెడ్ ఫోన్లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఫెస్టివల్ సమయంలో తక్కువ ధరకే లభించే టాప్ మొబైల్స్ ఏమున్నాయో ఓసారి చూద్దాం. 

లావా బ్లేజ్ కర్వ్ : (Lava blaze curve)

కర్వ్ ఫోన్ కొనాలనుకునేవారికి లావా బ్లేజ్ కర్వ్ బెస్ట్ ఛాయిస్. ఈ ఫోన్లో 6.67 అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ డిస్ల్పే ఉంటుంది. 64మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ధర కేవలం రూ. 14,499 మాత్రమే. 

శాంసంగ్‌ ఏ14 5జీ (Samsung A14 5G)

మీ బడ్జెట్ 10వేల లోపు అయినట్లయితే శాంసంగ్ బ్రాండ్ లో 5జీ స్మార్ట్ ఫోన్ బెస్ట్ఆప్షన్. ఏ14 5జీ స్మార్ట్ ఫోన్ మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 50మెగాపిక్సెల్ కెమెరాతోపాటు 5000ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. ధర కేవలం రూ. 9,999. అయితే ఈ మొబైల్ కు ఛార్జర్ విడిగా కొనాల్సి ఉంటుంది. 

Also Read: India First Air Train: దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్..దీని ప్రత్యేకతలు తెలుస్తే అవాక్కవ్వాల్సిందే 

మోటోరొలా జీ34 5జీ (Motorola G34 5G)

రూ. 10వేల లోపు మంచి మొబైల్ కొనుగోలు చేయాలంటే మోటోరోలా జీ 34 ఫోన్ 5జీ ఓసారి ట్రై చేయండి. ఈ మొబైల్  డిస్ప్లే 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ తోవస్తుంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ధర రూ. 9,999ఉంటుంది. 

ఐకూ జడ్‌ 9 లైట్‌ (IQOO Z9 Lite)

తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే మీరు ఐకూ జడ్ 9 లైట్ మొబైల్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో 50మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రూ. 9,499కి అందుబాటులో ఉంది. 

శాంసంగ్ ఎం35 5జీ (Samsung M35 5G):

మీ బడ్జెట్ 15వేల లోపు అయితే శాంసంగ్ ఎం 35 5జీ స్మార్ట్ ఫోన్ మంచి ఎంపిక. ఇందులో 6000ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ధర రూ. 13, 749 మాత్రమే. 

మోటోరోలా జీ 64 5జీ ( Motorola G64 5G):

15వేల లోపు స్మార్ట్ ఫోన్ కోసం  చూస్తున్నట్లయితే మోటోరోలా జీ 64 5జీని కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ధర రూ. 13,999. 

ఇక 15వేల రూపాయల లోపు బడ్జెట్​ ధరలో రియల్‌మీ నుంచి 3 ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.గేమింగ్‌ ప్రయారిటీ అనుకునేవాళ్లు రియల్‌మీ నార్జో 70 టర్బో మొబైల్ తీసుకోవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్స్  రూ.14,999లకు లభిస్తుంది. మంచి కెమెరా కోసం నార్జో 70 ప్రో స్మార్ట్​ఫోన్ తీసుకోవడం బెస్ట్. ఇది మార్కెట్లో రూ.14,999లకే అందుబాటులో ఉంది. దీంతోపాటు బెస్ట్ కెమెరా క్వాలిటీ కోసం రియల్‌మీ నార్జో 70 ఎక్స్‌ కూడా ఉంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4ను పోలి ఉండే ఒప్పో కే12ఎక్స్‌ మొబైల్​ కూడా  మార్కెట్లో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. డ్యామేజ్‌ ప్రూఫ్‌ బాడీ ఈ స్మార్ట్​ఫోన్ స్పెషాలిటి. 6.67 అంగుళాల హెచ్‌డీ డిస్ ప్లేతోపాటు 32 మెగాపిక్సెల్ కెమెరా ఇందులో ఉన్నాయి. ధర కేవలం రూ. 10,999. 

Also Read: School Holidays: భారీ వర్షాలు రెడ్‌ అలెర్ట్‌.. అన్నీ స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటన..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Section: 
English Title: 
Best Smartphones Under 15 thousand Want to buy a new mobile, these are the best phones under 15k
News Source: 
Home Title: 

 Best Smartphones Under 15000: దసరాకు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? 15వేల లోపు బెస్ట్ ఫోన్లు ఇవే ..అన్నీ టాప్ బ్రాండ్లే 

 Best Smartphones Under 15000: దసరాకు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? 15వేల లోపు బెస్ట్ ఫోన్లు ఇవే ..అన్నీ టాప్ బ్రాండ్లే
Caption: 
Best Smartphones Under 15k
Yes
Is Blog?: 
No
Tags: 
Byline: 
FILE
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
దసరాకు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? 15వేల లోపు బెస్ట్ ఫోన్లు ఇవే ..అన్నీ టాప్ బ్
Bhoomi
Publish Later: 
No
Publish At: 
Thursday, September 26, 2024 - 16:13
Created By: 
Madhavi Vennela
Updated By: 
Madhavi Vennela
Published By: 
Madhavi Vennela
Request Count: 
21
Is Breaking News: 
No
Word Count: 
402