Poco M6 Pro 5G Price In India: ప్రస్తుతం వినియోగదారులు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు మధ్యతరగతి వారికి కూడా లభించే విధంగా మొబైల్‌ని తయారు చేస్తున్నాయి. అయితే ప్రముఖ టెక్ కంపెనీ Poco కూడా ఇలాంటి మొబైల్స్ తయారు చేయడానికి ఎప్పుడు ముందుంటుంది. ఈ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన మిడ్ రేంజ్ ఫోన్ Poco M6 Pro 5Gకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Poco ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో మొదట రూ. 14,999లతో ఫ్లిఫ్‌కార్ట్‌లో విక్రయించింది. అయితే ఈ కామర్స్ కంపెనీ సాధరణ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూ. 4,000వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ మొబైల్‌ను రూ. 10,999లకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ మరింత తగ్గింపు పొందడానికి బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్యాంకు ఆఫర్స్‌తో కొనుగోలు చేయాలనుకుంటే..దీని కోసం ఫెడర్ల్ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే దాదాపు రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
ఈ స్మార్ట్ ఫోన్ అదనపు డిస్కౌంట్స్ పొందడానికి PNB బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ కార్డ్‌ని వినియోగిస్తే రూ. 1500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,499లకే పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన కెమెరా, కూల్ పెర్ఫార్మెన్స్, ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన స్టాక్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో లేదు. ఇప్పుడే ఈ Poco M6 Pro 5G మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటే అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
Poco M6 Pro 5G స్పెసిఫికేషన్లు:
6.79 అంగుళాల HD+ డిస్ప్లే
90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
550nits పీక్ బ్రైట్నెస్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్
Turbo RAM ఫీచర్
Android 13 ఆధారిత సాఫ్ట్వేర్ స్కిన్
50MP ప్రధాన కెమెరా
2MP పోర్ట్రెయిట్ కెమెరా
8MP ఫ్రంట్ కెమెరా
3.5mm హెడ్‌ఫోన్ జాక్
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి