Mi 5A Smart TV: రూ.25 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.2999కే.. ఆఫర్ 3 రోజులు మాత్రమే..

Flipkart Big Bachat Dhamal: ఫ్లిప్‌కార్ట్‌లో 'బిగ్ బచత్ ధమాల్ సేల్'  రేపటి నుంచి ప్రారంభం కానుంది. రూ.99 విలువ చేసే వస్తువులు మొదలు రూ.1 లక్ష విలువ చేసే వస్తువుల వరకు ఈ ఆఫర్ ద్వారా బిగ్ డిస్కౌంట్‌ పొందవచ్చు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 25, 2022, 02:57 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో 'బిగ్ బచత్ ధమాల్ సేల్
  • ఈ నెల 26 నుంచి 28 వరకు
  • అన్నిరకాల వస్తువులపై భారీ తగ్గింపు
Mi 5A Smart TV: రూ.25 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.2999కే.. ఆఫర్ 3 రోజులు మాత్రమే..

Flipkart Offer on Mi 5A Smart TV: ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి 'బిగ్ బచత్ ధమాల్ సేల్' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 26 నుంచి 28 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. రూ.99 విలువ చేసే వస్తువులు మొదలు రూ.1 లక్ష విలువ చేసే వస్తువుల వరకు ఈ ఆఫర్ ద్వారా బిగ్ డిస్కౌంట్‌ పొందవచ్చు. దుస్తులు, షూస్, కిచెన్ వస్తువులు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇలా అన్ని రకాల వస్తువులు ఈ ఆఫర్‌లో చౌక ధరకే అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.25 వేలు విలువ చేసే ఎంఐ 5ఏ 80 సెం.మీ (32 అంగుళాలు) టీవీ ఈ ఆఫర్ ద్వారా డెడ్ చీప్ ధరకే లభిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో 44 శాతం డిస్కౌంట్ ఆఫర్ :

32 అంగుళాల ఎంఐ 5ఏ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.24,999. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో దీనిపై ఏకంగా 44 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ పోను కేవలం రూ.13,999కే ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. తద్వారా కస్టమర్స్‌కి రూ.11 వేలు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ టీవీ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీ కొనుగోలుకు ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో చెల్లింపులు జరిపినట్లయితే రూ.1000, రూ.1500 మేర అదనపు తగ్గింపు పొందగలరు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.2,999కే :

ఎంఐ 5ఏ స్మార్ట్ టీవీ (32 అంగుళాలు)పై బిగ్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. పాత టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా కస్టమర్స్‌కి గరిష్ఠంగా రూ.11 వేలు వరకు తగ్గింపు లభిస్తుంది. తద్వారా రూ.13 వేలకు అందుబాటులో ఉన్న ఈ టీవీని మరింత చౌకగా కేవలం రూ.2999కే కొనుగోలు చేయవచ్చు. ఇంత డెడ్ చీప్‌ ధరకే ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలంటే బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో మీ ఆర్డర్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే కాబట్టి రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ రాత్రి 12 గం. వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఎంఐ 5ఏ స్మార్ట్ టీవీ ఫీచర్స్ :

సపోర్టెడ్ యాప్స్ : నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ (గూగుల్ అసిస్టెంట్ అండ్ క్రోమ్‌క్యాస్ట్ ఇన్ బిల్ట్)
రిజల్యూషన్ : హెచ్‌డీ రెడీ 1366 x 768 పిక్సెల్స్
సౌండ్ అవుట్ పుట్ : 20 వాట్స్
రీఫ్రెష్ రేట్ : 60 Hz

Also Read:CJI NV Ramana: హైదరాబాద్‌ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్..పచ్చజెండా ఊపిన సీజేఐ ఎన్వీ రమణ..!

Also Read: Conspiracy on Liger: లైగర్-విజయ్ దేవరకొండపై కుట్ర..కావాలనే నెగటివ్ టాక్..వారి పనేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News