Apple Offers: మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌లపై మళ్లీ బ్యాక్ టు స్కూల్ ఆఫర్లు, ఎంత తగ్గుతున్నాయంటే

Apple Offers: ఆపిల్  స్కూల్ డీల్స్ ప్రారంభించింది. ఆపిల్ కంపెనీ ప్రముఖ మోడల్స్ మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 14, 2023, 12:16 PM IST
Apple Offers: మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌లపై మళ్లీ బ్యాక్ టు స్కూల్ ఆఫర్లు, ఎంత తగ్గుతున్నాయంటే

Apple Offers: కేవలం విద్యార్ధుల కోసమే తీర్చిదిద్దిన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇది. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో అద్భుతమైన మ్యాక్‌బుక్స్, ఐ ప్యాడ్స్ సొంతం చేసుకోవాలంటే ఇదే మంచి అవకాశం. అక్టోబర్ 2 వరకూ అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ విద్యార్ధులు, సాధారణ కస్టమర్లు పొందవచ్చు

ఈ ఆఫర్ విద్యార్ధుల కోసం రూపొందించినా ఇతరులు కూడా పొందవచ్చు. విద్యార్ధి గుర్తింపుపై ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. బిల్ మాత్రం విద్యార్ధి పేరు మీద ఉంటుంది. మ్యాక్‌బుక్ లేదా ఐప్యాడ్ వినియోగానికి మీ సొంత క్రెడెన్షియల్స్ వాడుకోవచ్చు. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్  ప్రకారం ఈ రెండింటిపై భారీ డిస్కౌంట్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. 

మ్యాక్‌బుక్ ధరలు ఇలా

MacBook Air 13 M1 అసలు ధర 99,900 రూపాయలు కాగా 10 వేల డిస్కౌంట్ అనంతరం 89,900కు లభిస్తుంది. ఇక ఇందులోనే MacBook Air 13 M2 అసలు ధర 1,14,900 రూపాయలైతే 10 వేల డిస్కౌంట్‌తో 1,04,900కు లభిస్తోంది. MacBook Air 13 M5 అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో 1,34,900 రూపాయలు అసలు ధర కాగా 10 వేల డిస్కౌంట్ అనంతరం 1,24,900 రూపాయలు అందుబాటులో ఉంది. ఇక MacBook Pro అయితే 13 ఇంచెస్ 1,19,900 రూపాయలు, 14 ఇంచెస్ అయితే 1,84,900 రూపాయలు, 16 ఇంచెస్ అయితే 2,29,900 రూపాయలకు లభిస్తున్నాయి.

ఐప్యాడ్, ఐ మ్యాక్ ఆఫర్లు

iMac 1,24,900 రూపాయలకు అద్భుతమైన డిజైన్, ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఇక Mac mini అద్భుతమైన డిస్కౌంట్‌తో 49,900 రూపాయలకే లభించనుంది. iPad Air ధర 54,900 రూపాయలు, iPad Pro 11 అయితే 76,900 రూపాయలు, iPad Pro 12.9 ధర 1,02,900 రూపాయలకు లభిస్తున్నాయి.

ఐఫోన్‌పై బోనస్ ఆఫర్లు ఇలా

బ్యాక్ టు స్కూల్ ఆఫర్లలో ఐఫోన్లు లేవు. కానీ ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 61,999 రూపాయలకు లభిస్తోంది. దీనిపై 2 వేల రూపాయల బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఇది మినహాయిస్తే ఐఫోన్ 13 కేవలం 59,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

Also read: Govt Schemes: రూ.5 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.కోటి ఆదాయం.. సింపుల్‌గా ఇలా చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News