Apple 14 Plus Price Cut Off: యాపిల్ కంపెనీ స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెంట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రతి సంవత్సరం యాపిల్ కొత్త కొత్త సిరీస్‌లతో స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తుంది. అతి త్వరలోనే ఐఫోన్ 15 సిరీస్ కూడా మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్ ఫోన్స్‌పై భారీగా ధరలను తగ్గించింది. కంపెనీ ఈ 14 సిరీస్ మొబైల్స్‌ను రూ. 89,990 ధరతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రస్తుతం 25 శాతం కంటే ఎక్కువ డిస్కౌంట్స్‌తో ఈ మొబైల్స్ లభిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ మొదటి నెలలో ఐఫోన్ 15 లాంచింగ్ కారణంగా 14 సిరీస్ ధరలను తగ్గించిందని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఐఫోన్ 14 సిరీస్‌లపై ఉన్న ఆఫర్స్ ఏంటో?..భారీ తగ్గింపుతో ఈ మొబైల్స్‌ను ఎలా కొనుగోలు చేయాలో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొదట ఐఫోన్ 14 ప్లస్‌ను ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ రూ.89,900లకు విక్రయించింది. అయితే త్వరలోనే ఐఫోన్ 15 సిరీస్ భారత మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. కాబట్టి వీటి సేల్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని ఐఫోన్ 14 ప్లస్‌పై 14 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 76,999లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయాలనుకుంటే..అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ కార్డ్‌ను వినియోగించడం వల్ల అదనంగా రూ. 4000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఐఫోన్ 14 ప్లస్ కేవలం రూ. 72,999లకే పొందవచ్చు. ఈ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం అధికారిక ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
ఎక్చేంజ్ ఆఫర్:
ఈ ఐఫోన్ 14 ప్లస్ మరింత తగ్గింపును పొందాలనుకునేవారు ఎక్చేంజ్ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను వినియోగిస్తే రూ. 60,000 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. అయితే ఈ బోనస్ మీ పాత స్మార్ట్ ఫోన్ కండీషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీ పాత స్మార్ట్ ఫోన్ ధర విలువ బట్టి ఈ ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది. అయితే మీ పాత స్మార్ట్ ఫోన్ కండీషన్ బాగుంటే ఐఫోన్ 14 ప్లస్‌ను కేవలం రూ.16,999లకే పొందవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్స్ ఇతర వివరాలు:
✾ A15 బయోనిక్ చిప్‌సెట్
✾ 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే
✾ iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్
✾ డ్యూయల్ కెమెరా సెటప్
✾ 12MP వైడ్ యాంగిల్ కెమెరా
✾ f / 1.7 ఎపర్చరు లెన్స్
✾ 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా
✾ 12MP TrueDepth ఫ్రంట్ కెమెరా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి