తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టి-20 మ్యాచ్ లో కివీస్ పై భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అడ్డుపడటంతో మ్యాచ్ను అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రారంభించారు. మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించారు. కాగా తొలుత బ్యాటింగ్ ఆరంభించిన కోహ్లీసేన నిర్ణీత 8 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. మనీష్ పాండే 17, హార్దిక్ పాండ్యా 14 పరుగులతో రాణించారు. కాగా 68 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన కివీస్ జట్టు నిర్ణీత 8 ఓవర్లలో ఆరువికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేయగల్గింది. భుమ్రా 2 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.
గువాహటి వేదికగా ఈ రోజు ఆసీస్ తో రెండో టి 20 సమరానికి కోహ్లీసేన సిద్ధమైంది. వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా ఈ మ్యాచ్ నెగ్గి టి 20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఆసీస్ తో ఇటీవలే జరిగిన టెస్టు, వన్డే సిరీస్ ను కోహ్లీ సేన కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టి 20 సిరీస్ కూడా నెగ్గి ఆసీస్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. ఆసీస్ తో జరిగిన గత ఏడు టి 20 మ్యాచుల్లో భారత్ అన్నింటిల్లోనూ నెగ్గింది. ఈ రికార్డును మరింత పదిలం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.
పరుగుల వరద పారేనా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.