2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరు అడ్డుకోలేరని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. నితీష్ తో భేటీ అనంతరం షా మీడియాతో మాట్లాడుతూ జేడీయూ తమకు విలువైన మిత్రపక్షమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్ని ప్రాంతీయ పార్టీలు కలిసినా తమను ఓడించలేరన్నారు. యావత్ భారతంలో బీజేపీ పాలన వచ్చేలా చేసేందుకు క్షేత్ర స్థాయిలో కృషి చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమితో నితీశ్ ఇమడలేకపోతున్నారని..ఆయన తిరిగి కాంగ్రెస్ కూటమిలోకి వెళ్లనున్నారని వస్తున్న వార్తలను అమిత్ షా ఖండించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.