BRS Working President KTR: ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రజల్లో మరింత తీసుకువెళ్లాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుందని.. ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
Minister KTR Review Meeting: అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కల్పించాల్సిన వసతులపై కీలక సూచనలు ఇచ్చారు. అన్ని శాఖాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Daifuku and Nicomac Taikisha in Ranga Reddy: జపాన్‌కి వెళ్లిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకొని వస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లాలో రెండు భారీ కంపెనీలకు ఆయన శంకుస్థాపన చేశారు. 575 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కంపెనీలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
KTR on Telangana Assembly Elections: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దమ్ముంటే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మరో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.