Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచినా.. సీఎం పదవిపై మాత్రం ఉత్కంఠ వీడటం లేదు. ఇది డైలీ సీరియల్ ను తలపిస్తోంది. సీఎం పదవిపై బీజేపీ, శివసేన షిండే మధ్య ఊగిసలాడుతోంది. గత ఎన్నికల్లో ఉద్ధవ్ బీజేపీతో ఎలా బిహేవ్ చేసాడో.. ఇపుడు సీఎం పదవి కోసం అదే సీన్ ను ఏక్ నాథ్ షిండే రిపీట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక రకంగా బీజేపీపై ఏక్ నాథ్ షిండే అలిగినట్టు కనిపిస్తోంది.
Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మహా విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేనే కొనసాగించాలని శివసైనికులు కోరారు. కానీ ఎక్కువ సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ న్యాయంగా ముఖ్యమంత్రి పదవి తమకే దక్కాలని అంటోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠంపై నిన్నటి వరకు పట్టు పట్టిన షిండే.. కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది.
Eknath Shinde: తాజాగా మహారాష్ట్రకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ..నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో విజయం సాధించినా.. ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడటం లేదు. సీఎం పదవి ఫడ్నవిస్, షిండేల మధ్య దోబూచులాడుతోంది. అయితే.. మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీనే ముఖ్యమంత్రిగా కావడం దాదాపు కన్ఫామ్ అని చెబుతున్నారు. సీఎం పదవి దక్కని నేపథ్యంలో షిండే బీజేపీ హై కమాండ్ ముందు కొన్ని డిమాండ్లు పెట్టనున్నట్టు సమాచారం.
Maharashtra New CM: దేశంలో ఎంపీ సీట్ల పరంగా రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో ఈ నెల 20న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక 23న ఎన్నికల ఫలితాలు వెలుబడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి నాలిగింట మూడు వంతులు సీట్లను గెలిచి సంచలనం రేపింది. విజయం తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరు అవుతారనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.
Eknath Shinde : తాజాగా మహారాష్ట్రకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, శివసేన షిండే,అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయ దుంధుబి మోగించింది. అయితే.. ఎలక్షన్స్ లో విజయం తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీ, శివసేన సిగపట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Maharashtra Chief Minister: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం విషయంలో ఇటు బీజేపీ, అటు శివసేన షిండే వర్గం ఎవరు వెనక్కి తగ్గకపోవటంతో... బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. చెరో రెండున్నర ఏళ్లు సీఎంగా ఇద్దరు ఉండేట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Maharashtra CM: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారంలోకి వచ్చినా.. ఇప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడలేదు. ఎన్నికల్లో ఎక్కువగా సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పీఠం తమకే కావాలంటోంది. మరోవైపు కూటమి వెళ్లి గెలిచిన నేపథ్యంలో తమకే సీఎం ఇవ్వాలని శివసేన పట్టుపడుతోంది. మొత్తంగా మహా పంచాయితీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.