Heavy rains predicted in Andhra Pradesh: ఈ నెల 23న వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన ఏపీ సర్కారు (AP govt).. తీర ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలకు పూనుకుంది.
Heavy rains due to low pressure in Bay of Bengal: జులై 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.
IMD predicts Heavy rains in Telangana: రుతు పవనాల రాకకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇలాగే మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీలో రానున్న మూడ్రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షపాతం నమోదవవచ్చని తెలుస్తోంది.
Heavy rains in Telangana, AP: హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలతో పోటెత్తిన వరదల కారణంగా పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో జనం సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు.
తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( Heavy rain ) నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లోకి వరద నీరు ఉప్పొంగుతుండటంతో అనేక జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి.
Weather updates | విశాఖ: తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 24 గంటల్లో ఆ అల్పపీడనం మరింత బలపడనున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా తెలంగాణ నుంచి రాయలసీమ వరకు అదే ఎత్తులో సమాంతరంగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.