WTC Final: ఎంఎస్ ధోనీని వెనక్కి నెట్టిన Virat Kohli, ఆసియాలో నెంబర్ వన్‌గా Team India కెప్టెన్

Team India Captain Virat Kohli: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహించడం ద్వారా టీమిండియాకు అత్యధిక మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో రికార్డు సొంతమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి..

Written by - Shankar Dukanam | Last Updated : Jun 20, 2021, 11:26 AM IST
WTC Final: ఎంఎస్ ధోనీని వెనక్కి నెట్టిన Virat Kohli, ఆసియాలో నెంబర్ వన్‌గా Team India కెప్టెన్

WTC final: క్రికెట్‌లో అంచెలంచెలుగా ఎదిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరో మైలురాయిని చేరుకున్నాడు. దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించాడు తద్వారా టెస్టు క్రికెట్ సరికొత్త చరిత్ర లిఖించాడు. న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో రికార్డు సొంతమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహించడం ద్వారా టీమిండియాకు అత్యధిక మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. గతంలో ఎంఎస్ ధోనీ (60 టెస్టులు) పేరిట ఈ రికార్డు ఉండేది. డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్టు విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా 61వ మ్యాచ్. 2014 డిసెంబర్‌లో ధోనీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం Team India కెప్టెన్‌గా కోహ్లీకి సుదీర్ఘ ఫార్మాట్ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. అప్పటినుంచి కోహ్లీనే ఈ ఫార్మాట్‌లో టీమిండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు.

Also Read: WTC Final Interesting Facts: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 5 ఆసక్తికర విషయాలు

61 టెస్టులకు కెప్టెన్సీ చేయడం ద్వారా టీమిండియాతో పాటు ఆసియాలోనే అత్యధిక మ్యాచ్‌లకు సారథిగా వ్యవహించిన ఆటగాడిగానూ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డులకెక్కాడు. శ్రీలంక తరఫున అర్జున రణతుంగ, పాకిస్తాన్ తరఫున మిస్బా ఉల్ హక్ సంయుక్తంగా 56 టెస్టులలో వారి జాతీయ క్రికెట్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ప్రపంచంలో అత్యధిక టెస్టులకు కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ నిలిచాడు. స్మిత్ 109 టెస్టులకు సారథిగా వ్యవహరించగా, ఆస్ట్రేలియాకు చెందిన అలెన్ బోర్డర్ 93 టెస్టులలో కెప్టెన్‌గా సేవలందించాడు.  

Also Read: Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌తో బాలీవుడ్ సెలబ్రిటీల ఫ్యాన్ మూమెంట్స్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News