ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అవసరమైతే అదనంగా రిజర్వ్ డే కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం నాడు ప్రకటన చేసింది. ఆ ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్ అయిదు రోజులలో ఏదైనా కారణంగా ఆటకు అంతరాయం కలిగితే 6వ రోజు మ్యాచ్ నిర్వహించనున్నామని ఐసీసీ పేర్కొంది.
గత ఏడాది కాల వ్యవధిలో జరిగిన అన్ని టెస్టు మ్యాచ్‌ల ఫలితాలను ఆధారంగా చేసుకుని తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లను ఫైనల్ చేరుకున్న టీమ్‌లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి గతంలోనే ప్రకటించింది. న్యూజిలాండ్, టీమిండియా తొలి రెండు స్థానాలు దక్కించుకుని, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC WTC Final) చేరుకున్నాయి. ఈ జట్ల మధ్య జూన్ 18న ఐసీసీ తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఒకవేళ ఆ టెస్టులో ఏదైనా సాంకేతిక కారణాలతో మ్యాచ్ సమయం చాలా మేర వృథా అయితే ఫలితం తేల్చడానికి రిజర్వ్ డేను ఐసీసీ కేటాయించింది. అయితే ఏ ఆటకం లేకుండా మ్యాచ్ జరిగి, డ్రా అయినా, టై అయినా ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది.
Also Read: IPL 2021: నిద్రలేని రాత్రులు గడిపిన R Ashwin, అందుకే ఐపీఎల్ 2021 మధ్యలోనే వైదొలిగాడు
షెడ్యూల్ ప్రకారం జూన్ 18 నుంచి 22 తేదీలలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నిర్వహించాలి. అయితే 5 రోజుల తరువాత మ్యాచ్ టైమ్ అధికంగా వృథా కావడంతో ఫలితం తేలని పక్షంలో రిజర్వ్ డేగా 6వ రోజును జూన్ 23గా తీసుకున్నామని ఐసీసీ స్పష్టం చేసింది. దీనిపై ఐసీసీ మ్యాచ్ రిఫరీ అవసరాన్ని బట్టి తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడని పేర్కొంది. ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్ సిప్ విజేతగా ఎవరు నిలుస్తారనే అంశంపై ఇతర క్రికెట్ల జట్లలో సైతం ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా(Team India)నే ఫెవరెట్ అని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Sagar Rana murder case: సాగర్ రాణాపై Sushil Kumar కర్రతో దాడికి పాల్పడుతున్న ఫోటో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
WTC Final Reserve Day: తొలి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై ఐసీసీ కీలక నిర్ణయం
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది
జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం
తొలి టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌పై కన్నేసిన భారత క్రికెట్ జట్లు